Monday, January 15, 2018

కంప్యూటర్ ప్రత్యూష్🔥*

*🔥కంప్యూటర్ ప్రత్యూష్🔥*



*♦దేశంలో అతివేగవంతమైన మొదటి మల్టి- పెటాఫ్లాప్స్ (పీఎఫ్) సూపర్ కంప్యూటర్ ప్రత్యూష్‌ను పుణెలోని ఐఐటీఎంలో ప్రారంభించారు. ప్రత్యూష్ అంటే సూర్యుడు అని అర్థం. ఈ కంప్యూటర్ ద్వారా దేశంలోని వాతావరణ విషయాలను, తుఫాన్లు, వాయుగుండాలను ముందుగానే తెలుసుకోవచ్చు. ముఖ్యంగా రుతుపవనాలను, వాతావరణంలో చోటుచేసుకొనే అనూహ్య వాతావరణ మార్పులను, తుఫాన్లు, సునామీ, భూకంపాలను, గాలి నాణ్యతను, కాంతి, సముద్ర పరిస్థితులను, వరదలు, కరువు తదితరాలను గతం కంటే వేగంగా, కచ్చితత్వంతో తెలుసుకోవచ్చు.*

*🔥ప్రత్యూష్ ప్రత్యేకతలు🔥*

*🔹వాతావరణ పరిశోధనలకు వినియోగించే కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెటాఫ్లాప్స్ (పీఎఫ్ - ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్)లో కొలుస్తారు. ప్రస్తుతం దేశంలో 1.0 పీఎఫ్ సామర్థ్యం మాత్రమే ఉంది.*

*🔹-ప్రత్యూష్ అనే సూపర్‌కంప్యూటర్‌ను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్‌సైన్సెస్ పరిధిలో ఏర్పాటుచేశారు. దీని సామర్థ్యం 6.8 పీఎఫ్. ఒకటి పుణెలో, రెండోది ప్రత్యూష్‌తో పుణెలోని ఐఐటీఎం సామర్థ్యం 4.0 పీఎఫ్, నోయిడాలోని ఎన్‌సీఎంఆర్‌డబ్ల్యూఎఫ్‌లో 2.8 పీఎఫ్ సామర్థ్యం ఉంటుంది.జి సైదేశ్వర రావు*

*🔹-పెరిగిన సామర్థ్యంతో దేశంలో వాతావరణ పరిశోధనల్లో ఉన్న కంప్యూటర్ సామర్థ్యం 6.8 పీఎఫ్‌కు చేరనుంది.*

*🔹ప్రపంచంలో మనకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న దేశాల్లో యూకే, జపాన్, యూఎస్ ఉన్నాయి. దీంతో భారత్ నాల్గో స్థానానికి చేరుకున్నది. ఇప్పటివరకు 7వ స్థానంలో ఉండేది.*

*♦ప్రత్యేకతలు:*

*🔹-8,600 కంప్యూటర్లకు ఉన్నంత స్టోరేజీ సామర్థ్యం, 25,000 పర్సనల్ కంప్యూటర్లకు ఎంత ర్యామ్ అవసరమో అంత ర్యామ్ ప్రత్యూష్ సూపర్ కంప్యూటర్‌లో ఉంది.*


*🔹-దీనిలో అత్యాధునిక ఇంటెల్ గ్జెనాన్ ప్రాసెసర్లను ఇందులో వినియోగించారు. ప్రత్యూష్‌పై కేంద్రం రూ. 450 కోట్లు వెచ్చించింది.*


*🔹-ఈ సూపర్ కంప్యూటర్‌తో దేశంలోని వాతావరణ పరిస్థితుల అంచనాలో పెనుమార్పులు రానున్నాయి. సూర్యకాంతి, వేడి, వాతావరణంలో తేమశాతం, సముద్రాల్లో మార్పులు, రుతుపవనాలు తదితర అంశాలను వేగంగా కచ్చితంగా తెలుసుకొనే అవకాశం ఏర్పడనున్నది.*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment