*🔥జనరల్ క్యాటగిరీ ఖాళీలకు రిజర్వుడ్ అభ్యర్థులు కూడా అర్హులే: సుప్రీంకోర్టు🔥*
*▪️న్యూఢిల్లీ : అడ్మిషన్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. జనరల్ క్యాటగిరీకి చెందిన చివరి అభ్యర్థి కంటే ఎక్కువ మార్కులు సాధించిన రిజర్వుడ్ క్యాటగిరీ అభ్యర్థులు కూడా జనరల్ క్యాటగిరీలో సీట్లు, ఉద్యోగాలు పొందడానికి అర్హులవుతారని పేర్కొంది. ఇలాంటి అభ్యర్థులకు జనరల్ క్యాటగిరీలో అవకాశం కల్పించిన తర్వాత మెరిట్ ప్రకారం రిజ ర్వుడ్ క్యాటగిరీ సీట్లను, ఉద్యోగాలను సంబంధిత క్యాటగిరీ అభ్యర్థులతో నింపాలని పేర్కొన్నది. ఉదాహరణకు గ్రూప్-1 ఖాళీల భర్తీలో జనరల్ క్యాటగిరీలో పోస్టు సాధించిన మహేశ్కు 120 మార్కులు వచ్చాయనుకుందాం. ఈ క్యాటగిరీలో పోస్టు సాధించిన వారిలో మహేశ్ చివరి అభ్యర్థి. అయితే బీసీ క్యాటగిరీకి చెందిన రాజుకు 121 మార్కులు వచ్చాయనుకుందాం. సుప్రీం కోర్టు తాజా తీర్పును అనుసరించి రాజును కూడా జనరల్ క్యాటగిరీలోనే పోస్టుకు ఎంపిక చేయాలి. 120 కంటే తక్కు వ మార్కులొచ్చిన బీసీ అభ్యర్థులను మాత్రమే మెరిట్ ప్రకారం బీసీ క్యాటగిరీ పోస్టులకు ఎంపిక చేయాలి. ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీలకూ ఇదే నిబంధన వర్తిస్తుంది.*
No comments:
Post a Comment