*"అల్లూరి సీతారామరాజు కి భారత ప్రభుత్వం అత్యున్నత గౌరవం"*
*భీమవరం రానున్న భారత ప్రధాని*
*జులై 4, 2022 న భీమవరంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఏడాది పాటూ జరిగే శ్రీ అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సంబరాలకు శ్రీకారం*
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి విశేష సహకారంతో ఫలించిన ది క్షత్రియ సేవా సమితి (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) వారి ప్రయత్నాలు.
భారత ప్రభుత్వం 75 సం. ల స్వాతంత్ర్యం సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"* కార్యక్రమం ద్వారా "UNSUNG HEROS" ని గుర్తించి గౌరవిస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లకు... శ్రీ అల్లూరి సీతారామరాజు గారి సేవలను భారత ప్రభుత్వం గుర్తించి గౌరవించడం ద్వారా సుమారు 100 సంవత్సరాల తెలుగు ప్రజల ఆకాంక్షను గౌరవించడమే. ఇది తెలుగు ప్రజల విజయం ... దేశ భక్తునికి ఘన నివాళి.
కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి విశిష్ట కృషి మరియు ప్రత్యేక శ్రద్ధ వలన... తెలుగు రాష్ట్రల సాంస్కృతిక మంత్రిత్వ శాఖల వారి సౌజన్యం తో శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్షత్రియ సేవా సమితి (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) పలు కార్యక్రమాలు ఇటు తెలుగు రాష్ట్రాల్లో మొదలు పెట్టి తరువాత దేశ వ్యాప్తంగా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించడం జరిగింది.
*జులై 4, 2022 నుండి జులై 4, 2023* ... ఒక సంవత్సరం పాటూ వివిధ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు ...అటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ... ఇటు స్థానిక ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సేవా మరియు స్వచ్చంద సంస్థలు, అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్షత్రియ సేవా సమితులు, క్షత్రియ యువజన సంఘాలు, మహిళా సంఘాల సహాయ సహకరాలతో ... *కుల, మత, ప్రాంత రహితంగా శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125 వ జయంతిని ఘనంగా నిర్వహించి...దేశం కోసం తృణప్రాయంగా తన ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుడు... విప్లవజ్యోతి శ్రీ అల్లూరికి విశిష్ట గౌరవాన్ని అందించాలని మా ప్రయత్నం.*
*మేము తలపెట్టిన కార్యక్రమాలు:*
1. *మే 7 వ తేదీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారు తన ట్విట్టర్లో శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 98వ వర్ధంతి కి నివాళులు అర్పించడం*. అంతేకాకుండా, పీఎంఓ కార్యాలయం ద్వారా మరియు ప్రముఖుల ద్వారా శ్రద్దాంజలి ఘటించడం.
2. *"మన్ కీ బాత్" కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి గురించి ప్రస్తావించడం.*
3. *మే 7, 2022*
- రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ & క్షత్రియ సేవా సమితి (TS&AP) వారిచే రవీంద్రభారతిలో ఉదయం 11.00 గం. లకు తెలంగాణా ప్రభుత్వ ఘన నివాళి. శ్రీ కె టి రామారావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు మరియు ఇతర ప్రముఖులు పాల్గొంటారు.
- మే 7 సాయంత్రం 5 గం.లకు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు శ్రీమతి రోజా గారిచే వైజాగ్ లో ఘన నివాళి. పాండ్రంగి నుండి వైజాగ్ వరకు యువకుల బైక్ రాలీ. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇతర మంత్రులు కూడా పాల్గొంటారు. క్షత్రియ సేవా సమితి వైజాగ్ & క్షత్రియ సేవా సమితి TS&AP కలసి ఇతర క్షత్రియ సేవా సమితుల, క్షత్రియ యువజన సంఘాలు మరియు స్వచ్చంద సంస్థల సహకారంతో చేస్తున్న కార్యక్రమం.
*జులై 4, 2022 to జులై 4, 2023* ( 125 వ జయంతి జాతీయ సంబరాలు)
1. *జులై 4, 2022 :* 125వ జయంతి సందర్భంగా శ్రీ అల్లూరి సీతారామరాజు గారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారిచే ఘన నివాళి. *ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు భీమవరం పట్టణంలో భారీ బహిరంగ సభా ముఖంగా అల్లూరి కి ఘన నివాళి*.
- అల్లూరి సీతారామరాజు గారి స్వగ్రామం మోగల్లు గ్రామంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం సహాయంతో... ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి చేతుల మీదుగా చారిత్రాత్మక మైన నిర్మాణం (Land mark Monument) జాతికి అంకితం. (Virtual Launch from Bhimavaram meeting)
- మోగల్లు గ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు గారు బాల్యంలో గడిపిన ఇంటిని రీ మోడల్ చేసి, శ్రీ అల్లూరి సీతారామరాజు ధ్యాన మందిరం గా జాతికి అంకితం. అల్లూరి జీవిత చరిత్ర మరియు విశేషాల నిక్షిప్తీత.
తద్వారా అల్లూరి స్వగ్రామం మోగల్లు ఒక ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా మారే అవకాశం.
2. అల్లూరి సీతారామరాజు గారి తల్లి స్వగ్రామం మరియు ఆయన పుట్టిన పాండ్రంగి గ్రామంలో ఆయన ఆనవాళ్లను పునరుద్ధరించి కాపాడుకోవడం.
3. రాష్ట్ర మరియు కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో, కృష్ణదేవి పేట లో ఉన్న శ్రీ అల్లూరి సీతారామరాజు ఉద్యానవనం సుందరీకరణ పనులు.
4. శ్రీ అల్లూరి సీతారామరాజు గారు తనకు తానుగా బ్రిటీష్ ప్రభుత్వానికి లొంగిపోయిన మంప గ్రామం కు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేయడం. ఏ చెరువు ఒడ్డున అయితే లొంగిపోయారో, ఆ చెరువు సుందరీకరణ మరియు చెరువు మధ్యలో శ్రీ అల్లూరి విగ్రహ ప్రతిష్ఠ.
5. *ఆగస్ట్ 22, 2022*- *రంప తిరుగుబాటుకు 100 సంవత్సరాలు*. ఆగస్ట్ 22, 1922 న చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి తో మన్యం తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు. ఆగస్ట్ 22, 2022 న చింతపల్లి నుండి ర్యాలీ. చింతపల్లి పోలీస్ స్టేషన్ ఆనవాళ్లను పునరుద్ధరించడం
6. మన్యం లో శ్రీ అల్లూరి సీతారామరాజు గారి విప్లవ ఆనవాళ్లను పునరుద్ధరించడం. రాజవొమ్మంగి, అడ్డతీగల, నరసీపట్నం ... ఇలా అల్లూరి చరిత్ర తో ముడిపడిన వివిధ ఆనవాళ్లను కాపాడుకోవడం.
7. శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రను 15 ని.లు నిడివి గల 3D అనిమేషన్ చిత్రం నిర్మాణం మరియు అల్లూరి విశిష్టతను తెలిచేస్తూ రాంభట్ల నృసింహా చారి గారి రచనలో మాధవపెద్ది సురేష్ గారి సంగీత సారధ్యంలో ఒక అద్భుతమైన పాట జాతికి అంకితం.
8. ముఖ్యంగా... శ్రీ అల్లూరి సీతారామరాజు గారితో కలసి పనిచేసిన పలు వీరుల (గంటం దొర, మల్లు దొర, గోకిరి ఎర్రేసు, అగ్గిరాజు....) కుటుంబాలను గుర్తించి, వారి ఆర్ధిక స్థితి గతులు తెలుసుకుని... వారి కుటుంబాలను ఆర్ధికంగా...సామాజికంగా ఆదుకుని శాశ్వత పరిష్కారం అందించడం. మన కోసం, మన మనుగడ కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుల కుటుంబాలను ఆదుకోవడం మనందరి బాధ్యత అని మా భావన.
9. మే7, 2023 - దేశ వ్యాప్తంగా ఇటు కేంద్ర మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలచే అధికారిక శ్రద్ధాంజలి.
10. జులై 4, 2023 - లంబసింగి ప్రాంతంలో 35 కోట్ల తో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న *స్వాతంత్ర్య సమరయోధుల* మ్యూజియం జాతికి అంకితం ద్వారా సంవత్సరం పాటూ నిర్వహించ తలపెట్టిన శ్రీ అల్లూరి సీతారామరాజు125 వ జయంతి జాతీయ సంబరాలు ముగుస్తాయి.
అంతే కాకుండా... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి ద్వారా తెలుగు ప్రజల ఆకాంక్షను క్షత్రియ సేవా సమితి (TS&AP) వారు గౌ. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారికి విన్నవించడం జరిగింది:
1. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పార్లిమెంట్ లో ప్రతిష్టించడం
2. విశాఖపట్నం లో రానున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం
3. భావి తరాలకు స్ఫూర్తిదాయకమైన మన్యం తిరుగుబాటు ను దేశ వ్యాప్తంగా అన్ని సిలబస్ లో పాఠ్యంసంగా చేయాలని కోరడం జరిగింది.
మేము తలపెట్టున ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ ... మా టీమ్ కి మీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని... ఒక కుటుంబం లా అందరం కలిసి ... ఒక వేడుకగా ప్రతీ కార్యక్రమం జరుపుకుందాం. మీ అమూల్యమైన సూచలను, సలహాలను అందించి మాకు మరింత బలం చేకూర్చాలని మనవి.
దేశభక్తి ని, దైవభక్తి ని విడివిడిగా చూడలేము అని నమ్మిన ఆ మహనీయుని గౌరవించడం అంటే దేశాన్ని, దైవాన్ని సమానంగా గౌరవించడమే.
చివరిగా ... ఈ సంవత్సరం కాలంలో శ్రీ అల్లూరి సీతారామరాజు మరియు వారితో పాటూ మన్యం తిరుగుబాటు లో పాల్గొని ... తమ కుటుంబ భాధ్యతలను పక్కనపెట్టి ... మన కోసం, మన భవిష్యత్తు కోసం త్యాగం చేసిన వారి కుటoబీకులను గౌరవించడం, ఆదుకోవడం కూడా మా ప్రణాళికలో ముఖ్య భాగం. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం పై గిరిజన హక్కులకోసం, దేశ స్వేచ్చ కోసం పూరించిన సమర శంఖారావం, విప్లవ సాయుధ పోరాటం *"మన్యం తిరుగుబాటు"* మూడు వందల సామ్.ల భారత స్వాతంత్ర్య చరిత్ర లో స్వర్ణలిఖితం. ఛత్రపతి శివాజీ తరువాత జరిగిన ఏకైక గెరిల్లా యుద్ధం. 100 సం. ల క్రితం బ్రిటీష్ ప్రభుత్వం ఆరోజుల్లోనే 40 లక్షలు ఖర్చుపెట్టడం, సుమారు 2300 సాయుధ బ్రిటీష్ దళాల ను మన్యంలో మోహరించడం మన్యం తిరుగుబాటు యొక్క ప్రత్యేకతను, ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. ఇటువంటి చారిత్రాత్మక పోరాటాన్ని జరిపిన తెలుగు పౌరషాన్ని ప్రతి ఒక్కరికీ తెలియచేయడo తెలుగు వాడిగా...ఒక భారతీయుడిగా మనకి గౌరవం...గర్వకారణం.
*భారత్ మాతా కి జై !! జై హింద్ !!*
మీ భవదీయులు
పేరిచెర్ల నాగరాజు. నడింపల్లి నాని రాజు
అధ్యక్షులు. ప్రధాన కార్యదర్శి
మరియు... కమిటీ సభ్యులు
క్షత్రియ సేవా సమితి ( తెలంగాణ & ఆంధ్రప్రదేశ్)
హైదరాబాద్.
Note: అనుకోని వర్షాభావం వలన కానీ, రవాణా సౌకర్య లోపాల వలన ఏదైనా ఇబ్బంది వస్తే తప్ప... ప్రధాని ప్రోగ్రాం భీమవరం లో కంఫర్మ్.
No comments:
Post a Comment