Thursday, July 8, 2021

సర్ మీరిచ్చే బహుమతి ఢిల్లీ వచ్చి స్వీకరించడానికి నా దగ్గర డబ్బుల్లేవు. ఆ బహుమతిని పోస్ట్ ద్వారా పంపించండి..పద్మశ్రీ అవార్డ్ గ్రహీత కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖా సారాంశమిది.

 సర్ మీరిచ్చే బహుమతి ఢిల్లీ వచ్చి స్వీకరించడానికి నా దగ్గర డబ్బుల్లేవు. ఆ బహుమతిని పోస్ట్ ద్వారా పంపించండి..పద్మశ్రీ అవార్డ్ గ్రహీత కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖా సారాంశమిది.


మూడు జతల బట్టలు, అతుకుల రబ్బరు చెప్పులు, పగిలిన కళ్ళద్దాలు, 732 రూపాయలు..ఇవే పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ హల్దార్ నాగ్ యొక్క ఆస్తులు. ఇతను ప్రసిద్ధ గోస్లీ భాష కవి. ఈయన రాసినవాటిలో 20 కావ్యాలను ఎప్పుడు అడిగినా గుర్తు పెట్టుకుని చెప్పగలడం ఇతని ప్రత్యేకత. సంబల్ పూర్ విశ్వ విద్యాలయంలో 'హల్దార్ గ్రంథబలి-2' పేరిట ఈయన రచనలతో కూడిన పాఠ్య ప్రణాళిక ఉంది.


శ్రీ హల్దార్ నాగ్ ఒక పేద దళిత కుటుంబంలో జన్మించారు. ఇతనికి పదేళ్ల వయసులో తల్లి, తండ్రిని కోల్పోయి మూడో తరగతి తో చదువు ఆపేశారు. హోటల్స్ లో అంట్లు తోముతూ ఒక అనాధాశ్రమంలో ఉండేవారు. ఒక స్కూల్ లో వంటశాల నిర్వహణ ఉద్యోగం వచ్చింది. కొన్నేళ్ళు అక్కడ చేసిన తర్వాత వెయ్యి రూపాయల అప్పుతో ఒక చిన్న కొట్టు పెట్టుకుని పెన్నులు, పెన్సిళ్లు అమ్ముకునేవారు. అదే అతని ఆదాయం.


శ్రీ హల్దార్ గారు 1995 నుంచి 'రాం-శబరి' కావ్యం గురించి స్థానిక ఒరియా భాషలో ప్రజలకు బోధించేవారు. ఈయన రాసిన పద్యాలు, కావ్యాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉండేవి. ఐదుగురు విద్యార్థులు ఈయన రచనల మీద phd చేస్తున్నారు. మనం పుస్తకాల్లో ప్రకృతిని చూస్తున్నాం, కానీ శ్రీ హల్దార్ ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందుతూ పుస్తకాలను సేకరిస్తున్నారు.


టీవీ చానల్స్, మీడియా చెప్పడానికి ఇష్టపడని ఈ మట్టిలో మాణిక్యాన్ని మోదీ ప్రభుత్వం గుర్తించి 2016 లో పద్మశ్రీ తో గౌరవించుకుంది. 

వీరి రచనలు ప్రభుత్వం పాఠ్య గ్రంధాలుగా గుర్తించింది.వీరు 2017 లో ప్రజా పత్రిక 90 వ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిధిగా మన నగరానికి రావడం మనకి గర్వకారణం.

యింత నిరాడంబర, నిరపమాన ఒరియా కవి గారికి 🙏



No comments:

Post a Comment