*🔥భారత రాజ్యాంగం బిట్స్🔥*
1. ఉపాధి కల్పన ప్రభుత్వ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని పేర్కొనే అధికరణం?
జ. - *అధికరణం-15(4)*
2. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతిలో రిజర్వేషన్ కల్పించాలని పేర్కొనే అధికరణం?
జ.- *16(4)(ఎ)*
3. ఏ అధికరణం ప్రకారం అంటరానితనాన్ని నిషేధించారు?
జ.- *అధికరణం - 17*
4. అంటరానితనం నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందిం చారు?
జ. - *1955*
5. అంటరానితనం నిషేధ చట్టాన్ని పౌరహక్కుల చట్టంగా ఎప్పుడు మార్చారు?
జ. - *1976*
6. భారతదేశం ఒక సంక్షేమ రాజ్యమని ప్రకటించే అధికరణం?
జ. - *అధికరణం 38*
7. భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యసాధనకు చేర్చిన ప్రత్యేక అంశాలు?
జ.- *ఆదేశిక సూత్రాలు*
8. షెడ్యూల్డ్ కులాలు అనే పదాన్ని మొదట ఎక్కడ ఉపయోగించారు?
జ.- *మైసూర్ సంస్థానంలో*
9. షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తూ 1932లో కమ్యూనల్ అవార్డును ప్రకటిం చిన వారు?
జ. - *బ్రిటీష్ ప్రధాని రామ్‌సే మెక్ డోనాల్డ్*
10. ఇటీవల పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం దేశంలో షెడ్యూల్డ్ కులాల సంఖ్య?
జ. - *1206*
No comments:
Post a Comment