Tuesday, October 30, 2018

భారత రాజ్యాంగం బిట్స్


*🔥భారత రాజ్యాంగం బిట్స్🔥* 
    
1. ఉపాధి కల్పన ప్రభుత్వ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని పేర్కొనే అధికరణం?
జ. -  *అధికరణం-15(4)*
2. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతిలో రిజర్వేషన్‌ కల్పించాలని పేర్కొనే అధికరణం?
జ.- *16(4)(ఎ)*
3. ఏ అధికరణం ప్రకారం అంటరానితనాన్ని నిషేధించారు?
జ.- *అధికరణం - 17*
4. అంటరానితనం నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందిం చారు?
జ. -  *1955*
5. అంటరానితనం నిషేధ చట్టాన్ని పౌరహక్కుల చట్టంగా ఎప్పుడు మార్చారు?
జ. - *1976*
6. భారతదేశం ఒక సంక్షేమ రాజ్యమని ప్రకటించే అధికరణం?
జ. - *అధికరణం 38*
7. భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యసాధనకు చేర్చిన ప్రత్యేక అంశాలు?
జ.-  *ఆదేశిక సూత్రాలు*
8. షెడ్యూల్డ్‌ కులాలు అనే పదాన్ని మొదట ఎక్కడ ఉపయోగించారు?
జ.- *మైసూర్‌ సంస్థానంలో*
9. షెడ్యూల్డ్‌ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తూ 1932లో కమ్యూనల్‌ అవార్డును ప్రకటిం చిన వారు?
జ. - *బ్రిటీష్‌ ప్రధాని రామ్‌సే మెక్‌ డోనాల్డ్‌*
10. ఇటీవల పార్లమెంట్‌ చేసిన చట్టం ప్రకారం దేశంలో షెడ్యూల్డ్‌ కులాల సంఖ్య?
జ. - *1206*

Friday, October 19, 2018

Prime minister's scholarship scheme:2018-


*Prime minister's scholarship scheme:2018-19 నోటిఫికేషన్ విడుదల:*

> *వృత్తిపరమైన కోర్సులు చేస్తున్న విద్యార్థులకు అర్హత. (BE, B.Tech, BDS, MBBS, B.Ed, BBA, BCA, MCA, B.Pharma, B Ed but not for BA+B Ed, LLB not for BA+LLB. In case of integrated ME/M.Tech/M.Pharma etc..).*

*>డిస్టెన్స్ కోర్సులకు అర్హత లేదు.*

> *విద్యార్థులు ఇంటర్/డిగ్రీ/గ్రాడ్యుయేషన్లో 60% కంటే మార్కులు తప్పనిసరి.*

> *ఎంపిక కాబడిన విద్యార్థులకు అబ్బాయిలకు నెలకు రూ.2000, అమ్మాయిలకు నెలకు రూ.2250 చొప్పున ఐదు సంవత్సరాలు చెల్లించబడును.*

> *ఆన్లైన్ దరఖాస్తు చివరితేది: 31-10-2018.*

>దరఖాస్తు కై క్లిక్ చేయండి
👇🏻👇🏻👇🏻
http://scholarships.gov.in/


Wednesday, October 17, 2018

🔥ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు🔥

*🔥ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు🔥*



      *⏰వ్యక్తి     -  కాలం⏰*

*సుకుమార్ సేన్   1950 - 1958*

*కె.వి.కె.సుందరం   1958 - 1967*

*ఎస్.పి.సేన్ వర్మ   1967 - 1972*

*డాక్టర్ నాగేంద్ర సింగ్   1972 - 1973*

*టి.స్వామినాథన్   1973 - 1977*

*ఎస్.ఎల్.షక్దర్   1977 - 1982*

*ఆర్.కె.త్రివేది   1982 - 1985*

*ఆర్.వి.ఎస్.పేరి శాస్త్రి   1985 - 1990*

*రమాదేవి   నవంబర్ 15, 1990 - డిసెంబర్ 12,1990*

*టి.ఎన్.శేషన్   1990 - 1996*

*ఎం.ఎస్.గిల్   1996 - 2001*

*జె.ఎం.లింగ్డో   2001 - 2004*

*టి.ఎస్.కృష్ణమూర్తి   2004 - 2005*

*బి.బి.టాండాన్   2005 - 2006*

*ఎన్.గోపాలస్వామి   2006 - 2009*

*నవీన్ చావ్లా   2009 - 2010*

*ఎస్.వై.ఖురేషి   2010 - 2012*

*వీరవల్లి సుందర సంపత్   2012 - 2015*

*హరి శంకర్ బ్రహ్మ   2015 జనవరి 16 నుంచి.. ఏప్రిల్ 18 వరకు*

*నసీం జైదీ   2015 ఏప్రిల్ 19 నుంచి 2017 జూలై 5 వరకు*

*అచల్ కుమార్ జ్యోతి   2017 జూలై 6 నుంచి జనవరి 22, 2018 వరకు*

*ఓం ప్రకాష్ రావత్   2018 జనవరి 23 నుంచి ...*


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Tuesday, October 16, 2018

🌹📚భారత రాజ్యాంగ లక్షణాలు_*📚🌹

*_🌹📚భారత రాజ్యాంగ లక్షణాలు_*📚🌹

1. గణతంత్ర అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి
గ్రహించారు ? – ఫ్రాన్స్‌
2. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో
ఏ పదాలను చేర్చారు ? – సామ్యవాద, లౌకిక, సమగ్రత
3. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి పేరుగాంచిన దేశం ?
– స్విట్జర్లాండ్‌
4. భారత ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు తోడ్పడేవి ? – ప్రాథమిక విధులు
5. రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ? – బెరుబెరి వర్సెస్‌ యూనియన్‌ – 1960
6. రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ?
– కేశవానంద భారతి వర్సెస్‌ కేరళ రాష్ట్రం – 1973
7. రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ వంటిదని పేర్కొన్నవారు ?
– జస్టిస్‌ మహ్మద్‌ హిదయతుల్లా
8. రాజ్యాంగానికి ప్రవేశిక తాళంచెవి వంటిదని
పేర్కొన్నవారు ? – ఎర్నెస్టు బార్కర్‌
9. ప్రవేశిక మన కలలకు, ఆలోచనలకు ప్రతిరూపం అని పేర్కొన్నవారు ? – కృష్ణస్వామి అయ్యర్‌
10. రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని ప్రకరణలు, షెడ్యూళ్లు, భాగాలు ఉన్నాయి ?
– ప్రకరణలు – 450, షెడ్యూళ్లు -12, భాగాలు -24 ఉన్నాయి.
11. రాజ్యాంగ ప్రవేశికకు మూలం ?
– నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానం
12. ప్రవేశిక ప్రకారం మన దేశం ?
– సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రదేశం.
13. రాజ్యాంగ మూలతత్వం, ఉపోద్ఘాతంగా దేన్ని పేర్కొంటారు ? – రాజ్యాంగ ప్రవేశిక
14. రాజ్యాంగ ప్రవేశిక ఏ అంశాలను తెలుపుతుంది ?
– 1. అధికారానికి మూలం, 2. రాజకీయ స్వభావం, 3. రాజ్యాంగ ఆశయాలు, 4. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ
15. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికిగల మరోపేరు ?
– బాధ్యతాయుత ప్రభుత్వం
16. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ ప్రధాన లక్షణం ?
– శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహించడం
17. అధికార పృద్ధక్కరణ (అధికార పంపిణీ) సిద్ధాంతం
ఏ ప్రభుత్వ విధానంలో అమల్లో ఉంటుంది ?
– అధ్యక్ష తరహా విధానం
18. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏ సూత్రాలతో పనిచేస్తుంది ? – సమష్టి బాధ్యత, వ్యక్తిగత బాధ్యత
19. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాగా తోడ్పడే ప్రభుత్వం ఏది ?
– పార్లమెంటరీ తరహా ప్రభుత్వం
20. మన దేశంలో పార్లమెంటరీ విధానానికి పునాదులు వేసిన చట్టం ? – 1919 మాంటెంగ్‌ చేమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం
21. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగమేది ? – అమెరికా రాజ్యాంగం
22. ఏ తరహా ప్రభుత్వానికి లిఖిత రాజ్యాంగం తప్పనిసరి ?
– సమాఖ్య ప్రభుత్వం
23. రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి తెలిపే షెడ్యూల్‌ ? – నాల్గో షెడ్యూల్‌
24. ఏడో షెడ్యూల్‌లో ఏ అంశాన్ని చర్చించారు ? – కేంద్ర-రాష్ట్ర సంబంధాలు
25. రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ? – దక్షిణాఫ్రికా
26. రాజ్యాంగ సవరణ గురించి తెలిపే ప్రకరణేది ? – 368
27. జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలను సవరించేందుకు ఏ రాజ్యాంగ సవరణ పద్ధతిని పాటిస్తారు ? – దృఢ పద్ధతి
28. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఏ రాజ్యాంగ సవరణ పద్ధతి పాటిస్తారు ? – సరళ పద్ధతి – 1/2 పార్లమెంట్‌ మెజార్టీ
29. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లును ఎవరు ప్రవేశపెట్టాలి ? – కేంద్ర హోంమంత్రి
30. రాజ్యాంగ సవరణ విధానం ఏ భాగంలో ఉంది ?
– 20వ భాగం
31. ద్వంద్వ పౌరసత్వం ఉన్న దేశాలకు ఉదాహరణ ?
– స్విట్జర్లాండ్‌, అమెరికా
32. ప్రవాస భారతీయులకు మనదేశంలో ఇచ్చే పౌరసత్వాన్ని ఏమని పిలుస్తారు ? – ఎల్లోకార్డు
33. మన దేశంలో ద్వంద్వ పౌరసత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ?
– జమ్మూ కాశ్మీర్‌
34. విదేశీయులకు కూడా వర్తించే హక్కులకు ఉదాహరణ ?
– అధికరణం -14,17,21,23,24
35. ప్రాథమికంగా రాజ్యాంగం 14 అధికార భాషలను గుర్తించింది. 15వ అధికార భాషగా సింధి భాషను ఎప్పుడు గుర్తించింది ? – 1967లో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా
36. న్యాయం అనే పదాన్ని ఎక్కడి నుంచి గ్రహించారు ?
– రష్యా
37. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలను ఎక్కడి నుంచి గ్రహించారు ? – ఫ్రాన్స్‌
38. ప్రవేశిక ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ?
– 26 నవంబర్‌, 1949

39. ప్రపంచశాంతి కోసం ఐక్యరాజ్యసమితిలో భారతదేశం ఎప్పుడు చేరింది ? – 30 అక్టోబర్‌ 1945
40. సామ్యవాద సమాజ స్థాపనకోసం 20 సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ? – 1975
41. మనదేశంలో ఏ తరహా న్యాయవ్యవస్థ ఉంది ?
– స్వయం ప్రతిపత్తి ఉన్న ఏకీకృత న్యాయవ్యవస్థ
42. ఏకీకృత న్యాయవ్యవస్థను ఎక్కడి నుంచి గ్రహించారు ?
– బ్రిటన్‌
43. ఏ తరహా న్యాయవ్యవస్థకు న్యాయసమీక్ష అధికారం ఉంటుంది ? – స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ
44. న్యాయసమీక్ష అంటే ? – శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేవోనని పరిశీలించే అధికారం
45. ఆల్ట్రావైరస్‌ అంటే ఏమిటి ? – ఏదైనా శాసనాన్ని రాజ్యాంగ విరుద్ధమైందిగా ప్రకటించడం
46. ఏ ప్రకరణ ప్రకారం కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి ? – ప్రకరణ-50
47. లౌకికరాజ్యం అంటే ? – అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, ఏ మతాన్నీ అధికార మతంగా స్వీకరించకుండా ఉండడం
48. మతరహిత రాజ్యానికి ఉదాహరణ ? – చైనా
49. ఏదైనా

ఒక మతాన్ని అధికార మతంగా స్వీకరిస్తే మత రాజ్యంగా పేర్కొంటారు. దీనికి ఉదాహరణలు ?
– పాకిస్తాన్‌, శ్రీలంక
50. మన రాజ్యాంగంలో మత స్వేచ్ఛను కల్పిస్తున్న ప్రకరణ ఏది ? – ప్రకరణ-25
51. లౌకిక రాజ్యస్థాపనకు తోడ్పడే ఉమ్మడి పౌరస్మృతిని ఏర్పాటు చేయాలని ఏ అధికరణం తెలుపుతోంది ?
– అధికరణం -44
52. ప్రజాస్వామ్యానికి పునాది అయిన సార్వజనీన వయోజన ఓటు హక్కును ఏ అధికరణం ప్రకారం కల్పించారు ?
– అధికరణం -326
53. ఓటింగ్‌ వయోపరిమితిని 21 నుంచి 18 ఏళ్లకు ఎప్పుడు తగ్గించారు ? – 1989లో 61వ సవరణ ద్వారా
54. మహిళలకు ఓటు హక్కును కల్పించిన మొదటి దేశం ?
– న్యూజిలాండ్‌
55. చట్టసభల్లో మహిళ భాగస్వామ్యం అధికంగా
ఉన్న దేశం ? – రువాండ
56. ప్రస్తుత లోక్‌సభలో మహిళా సభ్యుల సంఖ్య ఎంత ?
– 66
57. పౌరులకు మాత్రమే వర్తించే హక్కులు ?
– రాజకీయ హక్కులు
58. పౌరసత్వం గురించి తెలిపే నిబంధనలు ఏవి ? – 5-11
59. భారత పౌరసత్వ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు ?
– 1955
60. ఏ కమిటీ సిఫార్సు మేరకు ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు ?
– ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీ – 1986
61. 1951లో చేసిన మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా
ఏ షెడ్యూల్‌ను చేర్చారు ? – తొమ్మిదో షెడ్యూల్‌
62. భారత రాజ్యాంగంలో మన ప్రభుత్వాన్ని ఏవిధంగా పేర్కొన్నారు ? – రాష్ట్రాల సమ్మేళనం
63. భారత ప్రభుత్వం ఒక కేంద్రీకృత సమాఖ్య అని ఎవరు పేర్కొన్నారు ? – ఐవర్‌ జెన్నింగ్స్‌
64. భారత ప్రభుత్వం సాధారణ సమయంలో సమాఖ్య, అత్యవసర సమయంలో ఏకకేంద్ర ప్రభుత్వంగా పనిచేస్తుంది అని పేర్కొన్నవారు ? – బి.ఆర్‌.అంబేద్కర్‌
65. ప్రవేశిక ప్రకారం మన రాజ్యాంగ ఆశయాలు ?
– న్యాయం, స్వేచ్ఛ,  సమానత్వం, సౌభ్రాతృత్వం.
🌹📚📚📚🌾📚📚📚🌹

Sunday, October 14, 2018

🌧తుపాన్లకు పేర్లు ఎలా పెడతారు? అసలు పేర్లు పెట్టాల్సిన అవసరం ఏమిటి?🌧*

*🌧తుపాన్లకు పేర్లు ఎలా పెడతారు? అసలు పేర్లు పెట్టాల్సిన అవసరం ఏమిటి?🌧*


*ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రస్తుతం తిత్లీ తుపాను వణికిస్తోంది. ఈ తుపానుకు ‘తిత్లీ’ అనే పేరును పెట్టింది పాకిస్తాన్. ఆ పేరుకు అర్థం... సీతాకోక చిలుక.*

*సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఉత్తరాంధ్రను కుదిపేసిన ‘హుద్‌హుద్’ తుపానుకు ఓమన్ దేశం నామకరణం చేసింది. ‘హుద్‌హుద్’ అనేది ఓ పక్షి పేరు. ఫైలిన్, నిలోఫర్, లెహర్, దాయె... ఇవన్నీ ఇటీవలి కాలంలో ఆసియాలోని వివిధ ప్రాంతాలను వణికించిన తుపాన్లు. వీటికి ఆ పేర్లను ఆగ్నేయాసియాలోని వివిధ దేశాలు పెట్టాయి.*

*నిజానికి ఇలా తుపాన్లకు పేరు పెట్టే సంప్రదాయం అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్లో 1953 నుంచే ఉంది. ఐరాసకు చెందిన ‘వరల్డ్ మెట్రొలాజికల్ ఆర్గనైజేషన్’ ఈ పని చేస్తుంది. కానీ దక్షిణాసియాలో, మధ్య ప్రాచ్యంలో తుపాన్లకు పేర్లు పెట్టడం ఇటీవలే మొదలైంది. గతంలో చాలా ఏళ్ల పాటు హిందూ మహాసముద్రంలో పుట్టిన ఎన్నో తుపాన్లు ఏ పేరూ లేకుండా అనామకంగానే మిగిలిపోయాయి.*

*తుపాన్లకు పేర్లు లేకపోతే వాటి గురించి వివరించడం, విశ్లేషించడం, చర్చించడం కాస్త గందరగోళంగా ఉంటుందని వాతావరణ నిపుణులు భావించారు. మీడియాలో ప్రసారం చేసేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా వాటికి పేర్లు పెట్టడం సమంజసమని నిర్ణయించారు. అందుకే 2004లో ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఈ పేర్లపై సమావేశాన్ని నిర్వహించారు.*

*భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, శ్రీలంక, థాయిలాండ్... ఈ ఎనిమిది దేశాలూ ఆ సమావేశంలో పాల్గొన్నాయి. ఇందులో అన్ని దేశాలకూ సమ ప్రాధాన్యం లభించింది. ప్రతి దేశం తలా 8 పేర్లను కమిటీకి సమర్పించింది. అలా మొత్తంగా 64పేర్లతో ఓ జాబితా సిద్ధమైంది. ఆ పేర్లను భవిష్యత్తులో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలో రాబోయే తుపాన్లకు పెట్టాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.*

*ఏ పేరు ఎప్పుడు పెట్టాలి❓*

*ఏ తుపానుకు ఏ పేరు ఎప్పుడు పెట్టాలనే దానిపైన కూడా కమిటీ ఓ పద్ధతిని రూపొందించింది. దీని కోసం ఇంగ్లిష్ వర్ణమాల ఆధారంగా దేశాల పేర్లను ఒక క్రమంలో పెట్టారు. అంటే... ఇంగ్లిష్ అక్షరం ‘బి’ తో మొదలయ్యే బంగ్లాదేశ్‌ ఆ జాబితాలో మొదటి స్థానంలో, ‘టి’ అనే అక్షరంతో మొదలయ్యే థాయిలాండ్ ఆ జాబితాలో చివరి స్థానంలో ఉన్నాయి.*

*2004లో ఈ సమావేశం అనంతరం అక్టోబరులో హిందూ మహాసముద్రంలో సంభవించిన తుపానుకు ‘ఒనిల్’ అనే పేరును పెట్టారు. ఈ పేరును జాబితాలో మొదటి స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ సూచించింది. అదే ఏడాది నవంబరులో అరేబియా సముద్రంలో సంభవించిన తుపానుకు ‘అగ్ని’ అనే పేరు పెట్టారు. ఆ పేరును జాబితాలో రెండో స్థానంలో ఉన్న భారత్ సూచించింది.*

*అలా ఇప్పటిదాకా జాబితాలో ఉన్న దేశాలు వరసగా సూచించిన పేర్లనే ఒక్కో తుపానుకు పెడుతూ వచ్చారు. గతంలో భారత్‌ను వణికించిన ‘హుద్‌హుద్’ తుపాను పేరును ఒమన్, ‘ఫైలిన్’ తుపాను పేరును థాయిలాండ్, ‘వర్ధ’, ‘నర్గిస్’ పేర్లను పాకిస్తాన్ సూచించాయి.*

*ఎనిమిది దేశాలూ సూచించిన 64పేర్లలో ఇప్పటిదాకా 54 పేర్లను వాడేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో చెలరేగిన తుపానుకు పెట్టిన ‘తిత్లీ’ పేరు జాబితాలో 54వ స్థానంలో ఉంది.*

*‘తిత్లీ’ తరువాత ఉత్తర హిందూ మహాసముద్రంలో వచ్చే తుపానుకు ‘గజా’ అనే పేరు పెడతారు. ఈ పేరును శ్రీలంక సూచించింది.*


🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱   

Thursday, October 11, 2018

గ్రాడ్యుయేట్ MLC ఓటు నమోదు చేసుకోవటానికి చివరి తేదీ ..నవంబర్ 6 వ తేదీ 2018

*గ్రాడ్యుయేట్ MLC ఓటు నమోదు చేసుకోవటానికి చివరి తేదీ ..నవంబర్ 6 వ తేదీ 2018
----------------------------------------                                 *గ్రాడ్యుయేట్ MLC ఓటు నమోదుకు కావల్సిన PROOFS*

*1.Form 18*
*2.Degree certificate* ( OD/Provisional)

  🎯సూచన - :  1/10/2015 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు అనగా 1/11/2018 నాటికి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులయ్యి 3 సం. నిండిన వారు అర్హులు

*3. Passport size PHOTO*
*4. Residential certificate*

🎯సూచన - : Residential certificate పొందుపరిచే ముందు మీరు 3సం.రాలు పూర్తిగా (అంత కంటే ఎక్కువ ఉన్న) ఎక్కడయితే నివాసం ఉన్నారో ఆ R. C ని పెట్టాల్సి ఉంటుంది. ఈ R. C ఆధారంగానే enquire నిర్వహించబడుతుంది
🔍ఉదాహరణకు Residency certificates
 1. Aadhar
 2. Driving license
 3.gas conection
 4.Telephone bill..... మొదలగునవి.

*PROOFS పై ఉపాధ్యాయులకు సంబంధిత D. D. O గారి ద్వారా Attested చేయించుకొని, MRO సమర్పించి, Forum 18 లోని Receipt from application (దరఖాస్తు రశీదు) తీసుకొనవలయును*

            *లేదా*

*"మీ సేవా" నందు online submission చేయవచ్చు. ఇక్కడ submit చేసేముందు ఓటు నమోదుకు మనం పెట్టిన PROOFS scan చేసి submit చేయాల్సి ఉంటుంది Vote enquiry కి వచ్చినపుడు మీరు submit చేసిన PROOFS చూపించవలసి ఉంటుంది*

*ఓటు నమోదుకు చివరి తేదీ : 6/11/2018*
👍👍👍👍👍👍👍

 *🌻గమనిక : - మిత్రులారా ఇంతకు మునుపు నమోదు కాబడిన ఓట్లు మొత్తం రద్దు చేయబడినవి. ఇపుడు అర్హత కలిగిన ఉపాద్యాయ, ఉద్యోగ, పెన్షనర్సలు, సీనియర్ సిటిజన్స్, ఇతరులు అందరూ కొత్తగా ఓటు నమోదు చేససుకోవలయును.*

Tuesday, October 9, 2018

*🔥ఆర్మీ పాఠశాలల్లో 8000 టీచర్లు🔥*



*🌀ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ (అవేస్) దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ స్కూళ్లలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.*

*-మొత్తం పోస్టులు: 8000*

*సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, సైకాలజీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, హోం సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్*

*-పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)*

*-ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ)*

*-ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ)*

*-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ/పీజీ, బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. బీఈడీ/ రెండేండ్ల డిప్లొమాలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సీటెట్/టెట్, అవేస్ సీఎస్‌బీ ఎగ్జామ్‌లో స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.*

*-అర్హత: 40 ఏండ్లకు మించరాదు. (ఢిల్లీ స్కూల్స్ లో టీజీటీ/పీఆర్‌టీకి 29 ఏండ్లు, పీజీటీ 36 ఏండ్లకు మించరాదు). టీచింగ్ రంగంలో ఐదేండ్లపాటు అనుభవం ఉన్నవారు 57 ఏండ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.*

*-పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తోపాటు 70 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.*

*-ఎంపిక: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, స్కిల్‌టెస్ట్ ద్వారా*

*-ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో టీజీటీ/పీజీటీ-180 మార్కు లు, పీఆర్‌టీ-90 మార్కులకు ఉంటుంది.*

*-టీజీటీ/పీజీటీ పోస్టులకు.. పార్ట్-1లో జనరల్ అవేర్‌నెస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ అండ్ మెథడాలజీ సబ్జెక్టుల నుంచి 90 మార్కులు, పార్ట్-2లో సంబంధిత సబ్జెక్టు నుంచి 90 మార్కులు ఇస్తారు.*

*-పరీక్ష సమయం: మూడు గంటలు.*

*-పీఆర్‌టీ పోస్టులకు: టీజీటీ/పీజీటీ పోస్టులకు పార్ట్-1లో సూచించిన అంశాల నుంచి 90 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.*

*-పరీక్ష సమయం: ఒకటిన్నర గంటలు*

*-నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు*

*-అప్లికేషన్ ఫీజు: రూ. 500*

*-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో*

-చివరితేదీ: అక్టోబర్ 24

-ఆన్‌లైన్ పరీక్షతేదీ: నవంబర్ 17,18

-ఫలితాలు విడుదల: డిసెంబర్ 3

-వెబ్‌సైట్:
 http://aps-csb.in