*🔥మన దేహంలో రక్తకణాలు ఎలా ఏర్పడతాయి?🔥*
*♦శరీరంలోని రక్తంలో ఉండే ఎర్రరక్తకణాలు, రక్త పట్టీలు (ప్లేట్లెట్స్), సుమారు 70 శాతం తెల్ల రక్త కణాలు ఎముకల్లో ఉండే మూలగ (Bone Marrow) నుంచి తయారవుతాయి. మిగతా తెల్లరక్త కణాలు రససంబంధిత ధాతువుల (lymphatic tissues) నుంచి తయారవుతాయి.*
*♦ఎర్ర కణాలు, తెల్లకణాలు, దేహంలో మొదటి నుంచి ఉండే వంశానుగత కణాలు (Stem Cells) ద్వారా క్రమేపీ జరిగే అతిక్లిష్టమైన పరివర్తనం వల్ల ఎముకల్లోని మూలగలో ఉత్పన్నమవుతాయి. మూలగలో ఉండే రక్తకణం కేంద్రకం కలిగి ఉంటుంది. అయితే ఆ రక్తకణం మూలగ నుంచి వెలువడేటపుపడు తన కేంద్రకాన్ని పోగొట్టుకుంటుంది. అపుడా రక్తకణం అసంపూర్ణ కణం. అలా వెలువడిన కణం ఊపిరి తిత్తులలోని ప్రాణవాయువును గ్రహించి, దాన్ని కణ జాలాల్లోని (Tissue) కార్బన్ డై ఆక్సైడ్‌తో మార్పిడి చేసుకుంటుంది. రక్తకణాలు ముఖ్యంగా మూడు విధులను నిర్వర్తిస్తాయి. అందులో మొదటిది ఎర్రరక్త కణాలు ఆక్సిజన్‌ను రవాణా చెయ్యడమైతే, రెండవది తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధక కణాలుగా వ్యవహరించడం, మూడవది గాయాల నుంచి రక్తం అదేపనిగా కారిపోకుండా గడ్డ కట్టే ప్రక్రియలో తోడ్పడడం.*
No comments:
Post a Comment