Thursday, August 16, 2018

మీ సేవాలో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కొన్ని ముఖ్యమైన సర్టిఫికెట్స్ కి ప్రజలు మీసేవ వారికి చెల్లించ వలసిన డబ్బు వివరాలు*

*మీ సేవాలో  గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కొన్ని ముఖ్యమైన సర్టిఫికెట్స్ కి ప్రజలు మీసేవ వారికి చెల్లించ వలసిన డబ్బు వివరాలు* క్రింది విధంగా ఉన్నాయ్, ఇందులో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీసేవ అధికారిక చెల్లింపుల పుస్తకం లో చూసుకోవచ్చు.

వరుస     సర్టిఫికెట్ పేరు    మీసేవ వారికి చెల్లించవలసిన
సంఖ్య                                                     డబ్బు 
1)     పొలం1b.                           25 ₹
2).   ఇన్కమ్ సర్టిఫికెట్.                35₹
3).   రెసిడెన్స్ సర్టిఫికెట్.               35₹
4)   క్యాస్ట్ సర్టిఫికెట్ +నేటివిటీ
         సర్టిఫికెట్.                          35₹
5)    ఓ.బి.సి సర్టిఫికెట్.                35₹
6)    ఈ.బి.సి సర్టిఫికెట్                35₹
7)  లేట్ బర్త్ సర్టిఫికెట్                  35₹
8)  లేట్ డెత్ సర్టిఫికెట్.                35₹
9) పొలం ఓల్డ్ అడంగళ్.               35₹
10) పోసేసియన్ సర్టిఫికెట్.          35₹
11)డూప్లికేట్ కాపీ పట్టాదారు పాస్స్బుక్   135₹
12)న్యూ పట్టాదారు పాస్స్బుక్.    135₹
13)రేషన్ కార్డ్ డేటా కరెక్షన్స్.      35₹
14)రేషన్ కార్డ్ ప్రింట్.                  15₹
15)రేషన్ కార్డ్ మెంబెర్ ఢిలిషన్.   35₹
16)రేషన్ కార్డ్ మోడీపీకేషన్.       35₹
17)రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్.             35₹
18)రేషన్ కార్డ్ మెంబెర్ ఆడిషన్.  35₹
19)ఎలక్షన్ వోట్ కార్డ్                  25₹
20)వోట్ కార్డ్ ప్రింట్.                    10₹  పైన తెలిపిన రేట్లు  కన్నా ఎక్కువ ఇవ్వాలని మీ సేవా కేంద్రాలు వారు  డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే వెంటనే  1100 కు ఫోన్ కాల్ చేసి వివరాలు చెప్పండి. *సమాచార హక్కు చట్టం 2005 RTI ACt 

*Central Govt Health Scheme

*Central Govt Health Scheme*

*పథకం పేరు* : ఆయుష్మాన్ భారత్
*ప్రారంభ తేది* : ఆగస్ట్ 15, 2018
*లాభాలు* :
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో *5లక్షల రూపాయిల వరకు ఇంటిల్లపాది ఉచితం గా వైద్యం చేయించుకోవచ్చు*. దీనికి ఆన్లైన్ లో ధరఖాస్తు పూర్తి చేసి వారి పేరుని నమోదు చేసుకోవాలి. మరియు *సంవత్సరానికి కేవలం రు.1324/- చెల్లిస్తే సరిపోతుంది.*
ప్రతి ఏడాది రు.5లక్షలు చికిత్స కొరకు పొందుతారు.
⤵ https://www.google.co.in/url?sa=t&source=web&rct=j&url=https://www.pradhanmantriyojana.in/ayushman-bharat-scheme-registration-form-online/amp/&ved=2ahUKEwia28auruzcAhVJto8KHQnoDWkQFjAAegQIBBAB&usg=AOvVaw1wjl84yR5ZoyP8_XBwBPzH&ampcf=1

Sunday, August 12, 2018

*🔥మన దేహంలో రక్తకణాలు ఎలా ఏర్పడతాయి?🔥*



*🔥మన దేహంలో రక్తకణాలు ఎలా ఏర్పడతాయి?🔥*

*♦శరీరంలోని రక్తంలో ఉండే ఎర్రరక్తకణాలు, రక్త పట్టీలు (ప్లేట్లెట్స్‌), సుమారు 70 శాతం తెల్ల రక్త కణాలు ఎముకల్లో ఉండే మూలగ (Bone Marrow) నుంచి తయారవుతాయి. మిగతా తెల్లరక్త కణాలు రససంబంధిత ధాతువుల (lymphatic tissues) నుంచి తయారవుతాయి.*

*♦ఎర్ర కణాలు, తెల్లకణాలు, దేహంలో మొదటి నుంచి ఉండే వంశానుగత కణాలు (Stem Cells) ద్వారా క్రమేపీ జరిగే అతిక్లిష్టమైన పరివర్తనం వల్ల ఎముకల్లోని మూలగలో ఉత్పన్నమవుతాయి. మూలగలో ఉండే రక్తకణం కేంద్రకం కలిగి ఉంటుంది. అయితే ఆ రక్తకణం మూలగ నుంచి వెలువడేటపుపడు తన కేంద్రకాన్ని పోగొట్టుకుంటుంది. అపుడా రక్తకణం అసంపూర్ణ కణం. అలా వెలువడిన కణం ఊపిరి తిత్తులలోని ప్రాణవాయువును గ్రహించి, దాన్ని కణ జాలాల్లోని (Tissue) కార్బన్‌ డై ఆక్సైడ్‌తో మార్పిడి చేసుకుంటుంది. రక్తకణాలు ముఖ్యంగా మూడు విధులను నిర్వర్తిస్తాయి. అందులో మొదటిది ఎర్రరక్త కణాలు ఆక్సిజన్‌ను రవాణా చెయ్యడమైతే, రెండవది తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధక కణాలుగా వ్యవహరించడం, మూడవది గాయాల నుంచి రక్తం అదేపనిగా కారిపోకుండా గడ్డ కట్టే ప్రక్రియలో తోడ్పడడం.*