Wednesday, March 28, 2018

*🔥ర్యాంకింగ్ (RANKING)

*🔥ర్యాంకింగ్ (RANKING)🔥*



ఒక సమూహంలోని వ్యక్తులకు పైనుంచి లేదా కింద నుంచి ర్యాంకులను పేర్కొంటారు. వీటి ఆధారంగా ఆ గుంపులోని మొత్తం వ్యక్తుల సంఖ్యను కనుక్కోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రశ్నలు పజిల్స్ రూపంలో ఉంటాయి. సమూహంలోని సభ్యుల ర్యాంకులను పరస్పరం మార్చడం ద్వారా... కొత్త ర్యాంకులతో ఇద్దరి మధ్య ఉండే వ్యక్తుల సంఖ్యను కనుక్కోవడం లాంటి ప్రశ్నలు ఈ కోవలోకి వస్తాయి.
తరగతిలో ఒక విద్యార్థి ర్యాంకు మొదటి నుంచి R1 , చివరి నుంచి R2 అయితే ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య

T = R1 + R2 – 1



Q.30 మంది గల తరగతిలో A యొక్క ర్యాంకు మొదట నుండి 12 అయిన అతనిర్యాంకు చివరి నుండి ఎంత?

జ. 30-12 = 18+1 = 19

Q. 40 మంది గల తరగతిలో కిరణ్ యొక్క ర్యాంకు చివరి నుండి 25 అయిన అతనిర్యాంకు మొదటి నుండి ఎంత?

జ. 40-25 = 15+1 = 16

Q. 60 మంది కలిగిన వరుసలో అనిల్ ఎడమవైపునుండి 24 వ వాడు అయిన అతను కుడివైపునుండి ఎన్నోవాడు?

జ.60-24 = 36+1 = 37

Q. 25 మంది కలిగిన బాలికల వరుసలో కవిత పైనుండి 9వది అయిన ఆమె క్రిందినుండి ఎన్నోవది?

జ.25-9 = 16+1 = 17

Q. 120 మంది కలిగిన వరుసలో రమేష్ ఉత్తరం వైపునుండి 45 వాడు అయిన అతను దక్షణం వైపునుండి ఎన్నోవాడు.

జ.120-45 = 75+1 = 76

Q.ఒక వరుసలో 20 మంది బాలురు కలరు ఆ వరుసలో సురేష్ అనే బాలుడు 4 స్థానాలు కుడి వైపుకు జరగడం వల్ల అతడు ఎడమవైపునుండి 11 వ వాడు అయ్యెను అయిన జరగక ముందు అతను కుడివైపునుండి ఎన్నోవాడు?

జ.11-7 = 7

20-7 = 13+1 =14వ వాడు

Q. ఒక వరసలో 30 మంది కలరు ఆ వరుసలో సునీల్ అనే వ్యక్తి 6 స్థానాలు కుడివైపుకు జరగడం వల్ల అతను ఎడమ వైపునుండి 15వ వాడు అయ్యెను అయిన అతను జరగకన్నా ముందు కుడివైపు నుండి ఎన్నోవాడు?

జ. 15-6 = 9

30-9 = 21+1 = 22

Q. ఒక తరగతిలో A యొక్క ర్యాంకు మొదటినుండి 9,అతని ర్యాంకు చివరినుండి 22 అయిన ఆ తరగతిలో ఎంతమంది కలరు?

జ. 9+22 = 31-1 = 30

Q.ఒక వరుసలో మోహన్ ఎడమవైపునుండి 18వ వాడు,అతడు కుడివైపునుండి 33వ వాడు అయినా ఆ వరుసలో మొత్తం ఎంతమంది కలరు?

జ. 18+33 = 51-1 = 50

Q. ఒక వరుసలో గోపాల్ పై నుండి 13 వ వాడు, క్రిందినుండి 33వ వాడు అయిన ఆ వరుసలో ఎంత మంది కలరు?

జ.13+33 = 46-1 = 45

Q.ఒక తరగతిలో రమేష్ యొక్క ర్యాంకు మొదటి నుండి 12 అతని ర్యాంకు చివరినుండి 29,ఆ తరగతిలో 10 మంది ఫెలయ్యెను అయిన ఆ తరగతిలో ఎంతమందికలరు?

జ. 12+29 = 41-1 =40+10 = 50

Q.ఒక చెట్లు వరుసలో ఒక చెట్టుని ఎటువైపునుండి చూసిన 5వది అయిన మొత్తం ఎన్ని చెట్లు కలవు?

జ.5+5 = 10-1 = 9

Q.ఒక పక్షుల వరుసలో ఒక పక్షి ఇరువైపుల నుండి 13 వది అయిన మొత్తం ఎన్ని పక్షులు కలవు?

జ.13+13 = 26-1 = 25

Q. ఒక తరగతిలో రవి యొక్క ర్యాంకు మొదటి నుండి 25,అతని ర్యాంకు చివరి నుండి 36,అదే తరగతిలోని గోపాల్ యొక్క ర్యాంకు మొదటినుండి 12 అయిన గొపాల్ యొక్క ర్యాంకు చివరి నుండి ఎంత?

జ.ముందుగా మనం తరగతి మొత్తం కనుక్కోవాలి

రవి- 25+36 =61-1 = 60

గోపాల్: 60-12 = 48+1 = 49

Q. ఒక వరుసలో A ఎడమవైపునుండి 9వ వాడు మరియు Bకుడివైపునుండి 17వ వాడు వారు తమ స్థానాలు తారుమారు చేసుకున్న తరువాత A ఎడమవైపునుండి 14 వ వాడు అయ్యెను అయిన ఆ వరుసలో మొత్తం ఎంతమంది కలరు?

జ.---->9A---B17<----

----B---->A14---->

14+17 = 31-1 = 30

Q. ఒక వరుసలో A ఎడమవైపునుండి 13వ వాడు మరియు Bకుడివైపునుండి 24వ వాడు వారు తమ స్థానాలు తారుమారు చేసుకున్న తరువాత A ఎడమవైపునుండి 18 వ వాడు అయ్యెను అయిన ఆ వరుసలో మొత్తం ఎంతమంది కలరు?

జ.---->13A---B24<----

----B---->A18---->

18+24 = 42-1 = 41

Q. ఒక తరగతిలో రాము ర్యాంకు చివరి నుంచి 22 కాగా మొదటి నుంచి 14. ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?

జ. R1 = 14, R2 = 22

∴ మొత్తం విద్యార్థుల సంఖ్య (T)

= 14 + 22 – 1

= 36 – 1 = 35

Q.40 మంది విద్యార్థులు ఉండే ఒక తరగతిలో రవి ర్యాంకు కుడి నుంచి 14 అయితే ఎడమ నుంచి అతడి ర్యాంకు ఎంత?

జ. T = 40, R1 = 14.

కాబట్టి ఎడమ నుంచి రవి ర్యాంకు

(R2) = 40 - 14 + 1 = 26 + 1 = 27

Q. ఒక వరుసలోని బాలికల్లో సుధ ఎడమ నుంచి 10వ స్థానంలోనూ, సంధ్య కుడి నుంచి 15వ స్థానంలోనూ ఉన్నారు. వారిద్దరూ స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత సుధ ఎడమవైపు నుంచి 25వ స్థానంలో ఉంది. ఆ వరుసలోని మొత్తం బాలికల సంఖ్య ఎంత?

జ.

వరుసలో ఎడమవైపు నుంచి సుధ స్థానం = 10

కుడివైపు నుంచి సంధ్య స్థానం = 15

వారి స్థానాలను పరస్పరం మార్చుకుంటే, సుధ స్థానం ఎడమవైపు నుంచి = 25, ఇది సంధ్య పూర్వ స్థానానికి సమానం.

ఎడమ నుంచి సుధ ర్యాంక్ (R1) = 25

కుడి నుంచి సుధ ర్యాంక్ (R2) = 15

ఆ వరుసలోని మొత్తం బాలికల సంఖ్య

(T) = R1 + R2 - 1

= 25 + 15 - 1 = 39

OR

వరుసలోని మొత్తం బాలికల సంఖ్య =

(స్థాన మార్పిడి తర్వాత ఎడమవైపు నుంచి సుధ స్థానం) + (మార్పిడికి ముందు కుడివైపు నుంచి సంధ్య స్థానం)- 1

= 25 + 15 -1 = 39

సూత్రం: (T) = R3 + R2 - 1

= 25 + 15 - 1 = 39

Q. 29 విద్యార్థులు ఉండే ఒక వరుసలో రోహిత్... ఎడ

మవైపు నుంచి 17వ వాడు కాగా కరణ్ కుడివైపు నుంచి 17వ వాడు. ఆ వరుసలో వారిద్దరి మధ్య ఎంతమంది విద్యార్థులు ఉంటారు?

జ.కుడివైపు నుంచి కరణ్ స్థానం = 17

కరణ్‌కు ఎడమవైపు ఉండే విద్యార్థుల సంఖ్య = 29 - 17 = 12

ఎడమ నుంచి కరణ్ స్థానం = 13

ఎడమవైపు నుంచి రోహిత్ స్థానం = 17

∴ వారిద్దరి మధ్య ఉండే విద్యార్థుల సంఖ్య = 3

Q.ఒక బాలికల వరుసలో నివేదిత ఎడమవైపు నుంచి 18వ స్థానంలోనూ, ప్రీతి కుడివైపు నుంచి 22వ స్థానంలోనూ ఉన్నారు. వారిద్దరి మధ్య 5 గురు బాలికలుంటే, ఆ వరుసలోని మొత్తం బాలికల సంఖ్య ఎంత?

జ.వివరణ: ఈ సమస్యను రెండు రకాలుగా సాధించ వచ్చు.

సందర్భం 1:

∴ వరుసలోని మొత్తం బాలికల సంఖ్య = 18 + 5 + 22 = 45

సందర్భం 2:

∴ వరుసలోని మొత్తం బాలికల సంఖ్య = 22 + 18 (5 + ప్రీతి + నివేదిత)

= 22 + 18 - 7

= 40 - 7 = 33.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮

╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Thursday, March 15, 2018

గ్రంథులు - విధులు🔥

*🔥గ్రంథులు - విధులు🔥*



       *🔹పిట్యూటరీ గ్రంథి🔹*

◆ దీన్నే పీయూష గ్రంథి అని కూడా అంటారు

◆ఈ గ్రంథి దాదాపు 10 లేదా అంతకంటే ఎక్కువ హార్మోన్‌లను స్రవిస్తుంది. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు.

◆ఇది మెదడు కింది భాగంలో బఠాని గింజ పరిమాణంలో ఉంటుంది.

◆ పెరుగుదల హార్మోన్, ఇతర హార్మోన్‌లను ఇదే ప్రేరేపిస్తుంది.

◆పెరుగుదల హార్మోన్ లోపిస్తే మరుగుజ్జుతనం వస్తుంది.

         *🔹 పారాథైరాయిడ్🔹*

◆ ఇది థైరాయిడ్ గ్రంథికి దగ్గరలో ఉంటుంది.

◆ పారాథార్మోన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.

◆ ఈ గ్రంథి కాల్షియం, ఫాస్పేట్‌ల వ్యాప్తిని క్రమబద్ధం చేస్తుంది.

◆ ఎముకలు వృద్ధి చెందడానికి ఇది చాలా కీలకం.

             *🔹 క్లోమ గ్రంథి🔹*

◆ దీన్ని మిశ్రమ గ్రంథి అంటారు.

◆ ఉదర భాగంలో జీర్ణాశయం కింద ఉంటుంది.

◆ ఇన్సులిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.

◆ ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిని నియంత్రిస్తుంది.

◆ శరీరంలో తగినంత ఇన్సులిన్ విడుదల కాకపోతే డయాబెటిస్ (షుగర్) వ్యాధి వస్తుంది.

         *🔹థైరాయిడ్ గ్రంథి🔹*

◆ దీన్నే అవటు గ్రంథి అని కూడా అంటారు.

◆ ఇది గొంతు దగ్గర వాయు నాళానికి ఆనుకుని ఉంటుంది.

◆ ఇది థైరాక్సిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.

◆ మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ గ్రంథి వాపుకు గురవుతుంది.

◆  థైరాయిడ్ గ్రంథి వాపుకు గురవడం వల్ల 'గాయిటర్' అనే వ్యాధి వస్తుంది.

◆  ఈ హార్మోన్ యుక్త వయసులో లోపిస్తే 'క్రెటినిజం' అనే వ్యాధి వస్తుంది.

◆ వయోజన దశలో ఈ హార్మోన్ లోపిస్తే 'మిక్సిడెమ' అనే వ్యాధి వస్తుంది.

            *🔹ఎడ్రినల్ గ్రంథి🔹*

◆ దీన్నే అధివృక్క గ్రంథి అని కూడా అంటారు.

◆ ఇది మూత్రపిండాలపై ఉంటుంది.

◆ ఎడ్రినలిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.

◆ ఒత్తిడి, కోపం, భయాందోళనలకు గురైనప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది.

◆ ఎడ్రినలిన్ హృదయ స్పందన రేటును, కండరాలకు రక్త సరఫరా రేటును పెంచుతుంది.

    *🔹పురుష బీజకోశాలు🔹*

◆ వృషణాల్లో ముష్క గోణుల్లో పురుష బీజ కోశాలుంటాయి.

◆  పురష లైంగిక హార్మోన్లు అయిన టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్‌లను ఇవి ఉత్పత్తి చేస్తాయి.

◆ వీటి వల్ల గౌణ లైంగిక లక్షణాలు వృద్ధి చెందుతాయి.

◆  పురష సంయోగ బీజాలైన శుక్రకణాల ఉత్పత్తిలో ఈ హార్మోన్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.

        *🔹 స్త్రీ బీజ కోశాలు🔹*

◆ఇవి మూత్రపిండాలకు దిగువన ఉంటాయి.

◆ స్త్రీ లైంగిక హార్మోన్లు అయిన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌లను ఇవి స్రవిస్తాయి.

◆ ఈ హార్మోన్‌లను స్త్రీలలో గౌణ లైంగిక లక్షణాల్ని అభివృద్ధి చేస్తాయి.

◆ఇవే హార్మోన్‌లు స్త్రీలలో రుతుచక్రాన్ని, ప్రత్యుత్పత్తి వ్యవస్థను నియంత్రిస్తాయి.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮
*
╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

వివిధ_సూచికలలో_భారత_ర్యాంక్



📈📉#వివిధ_సూచికలలో_భారత_ర్యాంక్📈📉
🎀🎀🎀🎀🎀🎀🎀🎀🎀🎀🎀🎀🎀🎀

#2018_19

📮లింగ గ్యాప్: 108

📮హెల్త్ కేర్ సూచిక: 154

📮నాణ్యత జాతీయత సూచిక: 101

📮LPG యొక్క అతిపెద్ద దిగుమతిదారు: 1

📮టాలెంట్ పోటీతత్వం సూచిక: 81

📮కాలుష్య సంబంధిత మరణాలు: 1

📮విలువైన దేశం బ్రాండ్: 8

📮ఇన్నోవేషన్ సూచిక: 60

📮గ్లోబల్ ఉత్పాదక సూచిక: 30

📮వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ సూచిక: 136

📮గ్లోబల్ పాల ఉత్పత్తి సూచిక: 1

📮సంఘటిత అభివృద్ధి సూచిక: 62

📮గ్లోబల్ రిటైల్ అభివృద్ది సూచిక: 1

📮నెట్వర్క్ సంసిద్ధత సూచిక: 91

📮వ్యాపార ఆశావాదం సూచిక: 7

Monday, March 12, 2018

🔥వ్యాధులు-సోకే అవయవాలు🔥

*🔥వ్యాధులు-సోకే అవయవాలు🔥*



*వ్యాధి*. ---  *అవయవం*

*1.గాయిటర్ -  థైరాయిడ్ గ్రంధి*

*2.ఎగ్జిమా - చర్మం*

*3.పియోరియా - పళ్ళుచిగుళ్ళు*

*4.డయాబెటిస్ -  క్లోమం*

*5.కామెర్లు  -  కాలేయం*

*6.న్యూమోనియా -  ఊపిరితిత్తులు*

*7.మెనింజెటిస్ -  మెదడు*

*8.పార్కిన్ సన్  -  మెదడు*

*9.ఎన్సెఫలైటిస్  -  మెదడు*

*10.ట్రకోమా -  కళ్ళు*

*11.కాటరాక్ట్స్ -  కళ్ళు*

*12.ఆర్థరైటిస్ -   కీళ్ళు*

*13.గౌట్ -   కీళ్ళు*

*14.స్పాన్డిలైటిస్ -  ఎముకలు*

*15.టైఫాయిడ్ - ప్రేగులు,శరీర భాగం మొత్తం*

*16.ఎయిడ్స్  - శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది*

*17.డిఫ్తీరియా  - గొంతు*

*18.పయేరియా -  చిగుళ్ళు*

*19.రూమాటిజం -  కీళ్ళు*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮

╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Saturday, March 10, 2018

🔥సంప్రదాయ నృత్యాలు🔥

*🔥సంప్రదాయ నృత్యాలు🔥*



💃 *కూచిపూడి :*

కూచిపూడి ఆంద్రప్రదేశ్ లో బాగా ప్రచారంలో ఉన్న నాట్యం.కూచిపూడి ఆంధ్రప్రదేశ్ లోని కుచేలపురం అనే గ్రామంలో అవతరించింది.సాధారణంగా దీనిని ఒక్కరే అభినయిస్తారు.తీర్థ నారాయణ,సిద్దేంద్రయోగి అనేవారు ఈ శైలిని రూపొందించారు.

💃 *కథక్ :*

ఈ నాట్యం ఉత్తర భారతదేశంలో బాగా బాగా ప్రసిద్ధి చెందింది.కథక్ అనే పదం కథ అనే పదం నుండి ఉద్భవించింది.దీనిని స్త్రీ,పురుషులిరువురు ప్రదర్శిస్తారు.
జి సైదేశ్వర రావు

💃 *మణిపురి :*

ఇది ఈశాన్య ప్రాంతంలో ముఖ్యంగా మణిపూర్ లో బాగా ప్రాచుర్యంలో ఉన్న  నాట్యం.ఈ నాట్యంలో రాధా-కృష్ణుడు గోపికల కధాంశాలను ఎక్కువగా ప్రదర్శించడం జరుగుతుంది.

💃 *భరతనాట్యం :*

దృశ్య కళల్లోభరతనాట్యానికి ప్రముఖ స్థానం ఉంది.ఇది దక్షిణ భారతదేశం లోని దేవాలయాలలో ఆవిర్భవించింది.భరతనాట్యం తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందింది.

💃 *ఒడిస్సీ :*

ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నాట్య రూపం.జైన రాజు ఖారవేలుడు పాలించిన క్రీ.పూ రెండవ శతాబ్దంలో ఈ నాట్య రూపం అభివృద్ధి చెందింది.

💃 *కథాకళి :*

ఇది కేరళ రాష్ట్రానికి చెందిన నాట్య రూపం.ఇది కేరళ లోని రాజాస్థానాలలో అవతరించింది.

💃 *మోహినీ అట్టం :*

ఇది కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది.దీనిని ఒక వ్యక్తీ మాత్రమే అభినయిస్తాడు.

*నృత్యము*       *ప్రాంతం*

●1.కూచిపూడి  -    ఆంధ్రప్రదేశ్

●2.కథక్     -   ఉత్తర భారతదేశం

●3.మణిపురి   -  మణిపూర్

●4.భరతనాట్యం  -  తమిళనాడు

●5.ఒడిస్సీ  -   ఒడిశా

●6.కథాకళి, మోహినీ అట్టం  -కేరళ

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮

╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Thursday, March 8, 2018

*మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం*

*మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం*



*మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం  సందర్భంగా మహిళామణులు అందరికీ శుభాకాంక్షలు తేలియజేస్తూ ...*

*మహిళల సంరక్షణకు పార్లమెంట్ చేసిన చట్టాలు*

👭 *వ్యభిచార నిరోధక చట్టం* (The Prostitution Prohibition Act), 1956

👭 *మహిళల అసభ్య ప్రదర్శన నిరోధక చట్టం* (The Indecent Representation of Women (Prohibition) Act), 1986
మహిళలను కించపరిచేవిధంగా అడ్వైర్టెజ్‌మెంట్, బొమ్మలు, రాతలు, నగ్న చిత్రాలు మొదలైనవి ఈ చట్టం ద్వారా నిరోధించారు.

👭 *సతి నిరోధక చట్టం* (The Sati Prohibition Act), 1987

👭 *వరకట్న నిషేధ చట్టం* (The Dowry Prohibition Act), 1961
వివాహానికి ముందుకాని, వివాహం తర్వాత కాని, మరెప్పుడైనా కాని వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడాన్ని ఈ చట్టం నిషేధిస్తుంది.

👭 *గర్భ నిరోధక నివారణ చట్టం* (The Medical Termination of Pregnancy Act), 1971

👭 *ముస్లిం వివాహాల రద్దు చట్టం* (The Dissolution of Muslim Marriages Act), 1939
తన వివాహాన్ని రద్దు చేసుకొనే హక్కుని ముస్లిం స్త్రీలకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.

*_విడాకులు పొందిన ముస్లిం మహిళ రక్షణ చట్టం_*, 1939
 భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం స్త్రీల హక్కులు కాపాడేందుకు ఈ చట్టం చేశారు.

👭 *కుటుంబ న్యాయస్థానాల చట్టం* (The Family Courts Act), 1984 : కుటుంబ తగాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు.

👭 *లీగల్ సర్వీసెస్ ఆథారిటీ చట్టం* (The Legal Services Authorities Act), 1987
మహిళ చట్టం ద్వారా రాజ్యం స్త్రీలకు ఉచిత న్యాయ సలహా అందిస్తుంది.

👭 *హిందు వివాహ చట్టం* (The Hindu Marriages Act), 1955
ఈ చట్టం ప్రకారం హిందూ మహిళ వివాహ, విడాకుల విషయంలో పురుషుడితో సమాన హక్కులు కలిగి ఉన్నాయి. ఈ చట్టం ఏకపత్ని విధానం, కొన్ని సందర్భాల్లో స్త్రీ తన భర్త నుంచి విడాకులు పొందే హక్కు కల్పిస్తుంది.

👭 *కనీస వేతన చట్టం* (The Minimum Wages Act), 1948
లింగ వివక్ష ఆధారంగా స్త్రీలకు కనీస వేతనాన్ని పురుషుని కంటే కనీస వేతనం కంటే తక్కువ నిర్దేశించరాదు

👭 *గనుల చట్టం* (The Mines Act), 1952

*_ఫ్యాక్టరీస్ చట్టం_*(The Factories Act), 1948
గనుల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేసే స్త్రీలతో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య పనిచేయించరాదు.

👭 *హిందూ వారసత్వ చట్టం* (The Hindu Succession Act), 1956
ఈ చట్టాన్ని 2005లో సవరించారు. ఈ చట్టం ప్రకారం మహిళలకు తమ తండ్రి ఆస్తిలో పురుషుడితో సమానహక్కు ఉంది.

👭 *Indian Christian Marriages Act* (1872)
క్రైస్తవ వివాహాలకు, విడాకులకు సంబంధించిన అంశాలు పొందుపర్చారు.

👭 *సమాన వేతన చట్టం* (The Equal Wages Act), 1976
 స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. లింగ వివక్ష ఆధారంగా స్త్రీలకు వేతనాలు తగ్గించరాదు.

👭 *మాతృత్వ ప్రయోజనాల చట్టం* (The Maternity Benefits), 1961
పని చేసే మహిళలకు ప్రసూతి ముందు, ప్రసూతి అనంతరం కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది.

👭 *గృహ హింస నిరోధక చట్టం* (The Domestic Violence Prohibition Act), 2005
ఎవరైనా కుటుంబసభ్యులు స్త్రీల పట్ల లైంగిక వేధింపులు, శారీరక, మానసిక, మాటల ద్వారా వేధిస్తే ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.

కింద పేర్కొన్న చట్టాల్లో స్త్రీల సంరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.
అవి...
1. రాష్ట్ర ఉద్యోగుల బీమా చట్టం – 1948
2. Plantation Labour Act – 1951
3. కట్టుబానిసత్వ నిరోధక చట్టం – 1976
4. Legal Practitioners (Women) act – 1923
5. భారత విడాకుల చట్టం (1869)
6. ప్రత్యేక వివాహాల చట్టం (1954)
7. విదేశీ వివాహాల చట్టం (1969)
8. పార్శీ వివాహ విడాకుల చట్టం (1936)
9. భారత సాక్ష్యాల చట్టం (Indian Evidence Act 1972)
10. హిందూ దత్తత, వివాహ చట్టం (1956)
11. జాతీయ మహిళా కమిషన్ చట్టం – 1990
12. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం – 2013

ప్రైవేట్, ప్రభుత్వ, సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలు లైగింక వేధింపుల నుంచి ఈ చట్టం ద్వారా రక్షణ పొందవచ్చు.

*_కేంద్ర సాంఘిక సంక్షేమ సంస్థ_* (Central Social Welfare Board) : 1953లో ఈ బోర్డును నెలకొల్పారు. కేంద్ర కార్యనిర్వాహకవర్గ తీర్మానం ద్వారా కంపెనీల చట్టం 1956 కింద ఈ సంస్థను 1969లో రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ న్యాయపరమైన హోదా కలిగి ఉంది. ఈ బోర్డు ప్రధాన ఉద్దేశం మహిళలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల అమలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించడం. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఈ బోర్డుకు ప్రథమ చైర్మన్‌గా వ్యవహరించారు.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮

╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Monday, March 5, 2018

*🎞ఆస్కార్ 2017 విజేతలు వీరే

*🎞ఆస్కార్ 2017 విజేతలు వీరే🎞*



🎞అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌ డాల్బీ థియేటర్‌లో 90వ ఆస్కార్‌ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆస్కార్ అవార్డు విజేతలను ప్రకటించారు. ఆ వివరాలు...

*🎞బెస్ట్ డైరక్టర్: గైలెర్మో డెల్ టోరో(ద షేప్ ఆఫ్ వాటర్)*

*🎞బెస్ట్ మూవీ: ద షేప్ ఆఫ్ వాటర్*

*🎞బెస్ట్ యాక్టర్ : గ్యారీ ఓల్డ్‌మ్యాన్(డార్కెస్ట్ హవర్)*

*🎞బెస్ట్ యాక్ట్రస్: ఫ్రాన్సెస్ మెక్ డొర్మాండ్(త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సౌరీ)*

*🎞బెస్ట్ సపోర్ట్ యాక్టర్: శామ్ రాక్‌వెల్(త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సౌరీ)*

*🎞బెస్ట్ సపోర్ట్ యాక్ట్రస్: అల్లిసన్ జానే(ఐ, టోన్యా)*

*🎞ఒరిజనల్ స్క్రీన్‌ప్లే: గెటౌట్*

*🎞అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: కాల్ మి బై యువర్ నేమ్*

*🎞బెస్ట్ ఫారిన్ మూవీ: ఎ ఫెంటాస్టిక్ ఉమెన్*

*🎞బెస్ట్ యానిమేటెడ్ ఫిలిం: కోకో*

*🎞బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: బ్లేడ్ రన్నర్ 2049*

*🎞బెస్ట్ ఎడిటింగ్: డన్‌కిర్క్*

*🎞బెస్ట్ యానిమేటెడ్ షార్ట్‌ఫిలిం: డియర్ బాస్కెట్ బాల్*

*🎞బెస్ట్ యాక్షన్ షార్ట్‌ఫిలిం: ద సైలెంట్ చైల్డ్*

*🎞బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిలిం: హెవెన్ ఈజ్‌ ఎ ట్రాఫిక్ జామ్ ఆన్ ది 405*

*🎞బెస్ట్ స్కోర్: ద షేప్ ఆఫ్ వాటర్*

*🎞బెస్ట్ సాంగ్: రిమెంబర్ మి(కోకో)*

*🎞బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: ద షేప్ ఆఫ్ వాటర్*

*🎞బెస్ట్ సినిమాటోగ్రఫీ: బ్లేడ్ రన్నర్ 2049*

*🎞బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: ఫాంటమ్ థ్రెడ్*

*🎞బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: డార్కెస్ట్ హవర్*

*🎞బెస్ట్ డాక్యుమెంటరీ: ఇకరస్*

*🎞బెస్ట్ సౌండ్‌ ఎడిటింగ్: డన్‌కిర్క్*

*🎞బెస్ట్ సౌండ్‌ మిక్సింగ్: డన్‌కిర్క్*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮

╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻