Tuesday, May 10, 2022

గొదరోళ్ళ మజాకానా

 గొదరోళ్ళ 

మజాకానా


ఎప్పుడో 1910లో మాటలెండి.. 


పనులేవో గుత్తకి తీసుకుందారని సర్కారోళ్ల ఆఫీసులోకొచ్చిన కాంట్రాక్టర్ అడ్డూరి రామచంద్రరాజుగారి  చూపు ముసుగేసున్న ఓ మిషను మీద పడింది.. 


ఇంతకు ముందు చూసినాటిలా లేదిది, ఏదో తేడాగా ఉందీ మిషననుకున్నారు బుగ్గమీద చేయ్యేసుకుని.. అక్కడికక్కడే బేరమాడి కొనుక్కునొచ్చి ఇంటివసరాలో బిగించేరు.. 


కొనుక్కునంటే వచ్చేరు గానీ ఎలావాడాలో తెలీక చాలాచోట్ల తిరిగేరు.. 


ఆఖరికి వాల్తేరురేవులో సుంకం కట్టించుకునే తెల్లదొరల్ని కలిసాక తెల్సిందేంటంటే అదొకరకం షోడా తయారుజేసే యంత్రమని తేలింది.. !!


కిందామీదా పడి మొత్తానికి ఎలావాడాలో నేర్చుకుని నీళ్ళూ, గ్యాసు కలిపి సీసాల్లోకి పట్టడం మొదలెట్టేడు రామచంద్రరాజుగారు.. 


తీరా పట్టాకా ఈ గ్యాస్ షోడా తయారుజెయ్యడానికంటే దాన్ని జనాల్తో తాగించడానికెక్కువ కష్టమైపోయింది ఆ అడ్డూరి రాజుగారికి.. 


మూతతీస్తుంటే చాలు బాంబు పేలినట్టున్న ఆ గ్యాస్ సౌండుకే భయపడిపోతన్నారంతా.. 


అటూఇటూ తిరుగుతుండే యుద్ధసైనికులు తాగడం మొదలెట్టారు ముందు.. చులాగ్గా తాగేస్తన్న ఆ బ్రిటీషోళ్ళని జూసి మెల్లిగా అలవాటు పడ్డారు జనాలు.. 


రామచంద్రరాజుగారి తమ్ముడు ఏదో పనుండి మద్రాసెళ్లి స్పెన్సర్స్ డ్రింక్ చూసొచ్చి ఆ డ్రింకు తాలూకూ వాళ్ళతో కాంట్రాక్ట్ మాట్టాడుకుని అక్కడ్నించి ముడిసరుకు ఇక్కడికి దిగుమతి చేస్కుని డ్రింకుతయారీ మొదలెట్టేరు..


బాగానే వెళ్తంది వ్యాపారం.. 


ఆలోగా రెండో ప్రపంచయుద్ధం వచ్చింది.. అన్ని రంగాల్లోనూ దేశాలమధ్య వాణిజ్యపరమైన ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి.. 


అప్పటికి దేశంలో ఉన్న ఆరేడు కూల్డ్రింకులు కూడా ఆగిపోయాయ్ బయట్నించి ముడిసరుకు రాక.. 


అవతల కలకత్తా నించొచ్చే బెహ్రాన్ డ్రింకు ఆగిపోయింది.. 


బొంబాయివాళ్ళ డ్యూకోకి దెబ్బడిపోయింది.. 


ఢిల్లీ రోజర్స్ బ్రాండ్, హైద్రాబాద్ నవాబ్ గారి అల్లావుద్దీన్ బ్రాండుల్ని కూడా ఆపేశారు.. 


మధురై నొంచొచ్చే విన్సెంటు, మద్రాసులో తయారయ్యే స్పెన్సర్స్ బుడ్లుకి కూడా కష్టంగా ఉంది.. 


ఇక్కడ డ్రింకు తయారుజెయ్యడానికి చూస్తేనేమో సరుకు లేదు.. 'ఇప్పుడెలా' అనుకున్నారు అన్నదమ్ములిద్దరూనూ..


రాత్రంతా ఆలోచించి పొద్దున్నే సూర్యుడు రాకుండానే బయల్దేరిపోయి మంచి కాపుమీదున్న తియ్య రాతినారింజలు కోసుకొచ్చేరు.. చిన్నపాటి వగరు కూడా ఉంటుంది మన్యంసైడు దొరికే ఆ రాతినారింజకి.. 


ఆ కాయలకి నిమ్మరసం కలిపి ఓ కొత్తరకం డ్రింక్ తయారుచేశారు.. 


మార్కెట్లోకి వదలగానే ప్రత్యకమైన రుచితో బాగా పేరెళ్ళింది జనాల్లోకి.. 


అప్పటి జనం దాన్ని అడ్డూరి రామచంద్రరాజుగారి కలర్ కాయన్నారు.. బ్రిటిషోళ్ళు ఏ.ఆర్ డ్రింకన్నారు.. ఒకప్పుడు ముడిసరుకు ఇచ్చిన స్పెన్సర్స్ అయితే మాక్కూడా మీరే తయారుజేసి పెట్టండన్నారు.. 


కానీ ఆ అన్నదమ్ములిద్దరూ మాత్రం తమకి ఎంతో ఇష్టమైన ఆ ఆటోమేటిక్ మిషన్ పేరు, రామచంద్రరాజుగారిది కలిసొచ్చేలా ఏదైనా పేరు పెట్టుకుందామనుకున్నారు.. !!


ఆ డ్రింక్ పేరే.. 


తయారైందగ్గర్నించీ ప్రత్యేకమైనరుచితో దాదాపు వందేళ్లపాటు మార్కెట్లో నిలబడి, 


మధ్యలో కోకోకోలా కంపెనీకి అమ్మకందాకా వెళ్ళిపోయి పేరుమార్చేస్తానంటే ఇష్టపడక వెనక్కొచ్చి కార్పొరేట్ కంపెనీల పోటీకి ఎదురునిలిచి ఇప్పటికీ ఉనికిని నిలుపుకున్న రామచంద్రపురం స్పెషల్ 'ఆర్టోస్ డ్రింక్'..


వందేళ్ల చరిత్ర ఉన్న ఈ డ్రింకు  గోదావరి జిల్లాలకు మాత్రమే సొంతం..

Monday, May 9, 2022

Indian Constitution* 🇮🇳

 *Indian Constitution* 🇮🇳

*భారత రాజ్యాంగ ఆర్టికల్ సంఖ్య మరియు పేరు* అందరూ తెలుసు కోవాలని మంచి ఉద్దేశంతో పంపడం జరిగింది. మీ ఫ్రెండ్ 


ఆర్టికల్ 1 - యూనియన్ పేరు మరియు భూభాగం

ఆర్టికల్ 2 - కొత్త రాష్ట్రాల ప్రవేశం లేదా స్థాపన

ఆర్టికల్ 3 - రాష్ట్రం యొక్క సృష్టి మరియు సరిహద్దులు లేదా పేర్ల మార్పు

ఆర్టికల్ 4 - మొదటి షెడ్యూల్డ్ మరియు నాల్గవ షెడ్యూల్స్కు సవరణలు మరియు రెండు మరియు మూడు కింద చేసిన శాసనాలు

ఆర్టికల్ 5 - రాజ్యాంగం ప్రారంభంలో పౌరులు

ఆర్టికల్ 6 - పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తున్న కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు

ఆర్టికల్ 7 - భారతదేశం నుండి పాకిస్తాన్ వెళ్లేవారికి కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు

ఆర్టికల్ 8 - భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తుల పౌరసత్వ హక్కులు

ఆర్టికల్ 9 - స్వచ్ఛందంగా విదేశీ రాష్ట్ర పౌరసత్వం తీసుకుంటే భారత పౌరుడు కాదు

ఆర్టికల్ 10 - పౌరసత్వ హక్కుల నిలకడ

ఆర్టికల్ 11 - పౌరసత్వం కోసం చట్టాన్ని పార్లమెంట్ నియంత్రిస్తుంది

ఆర్టికల్ 12 - రాష్ట్ర నిర్వచనం

ఆర్టికల్ 13 - ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే లేదా అవమానించే చట్టాలు

ఆర్టికల్ 14 - చట్టం ముందు సమానత్వం

ఆర్టికల్ 15 - మతం, కులం, లింగం, సంతతి లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించడం

ఆర్టికల్ 16 - ప్రజా ప్రణాళికలో అవకాశాల సమానత్వం

ఆర్టికల్ 17 - అంటరానితనం యొక్క ముగింపు

ఆర్టికల్ 18 - శీర్షికల ముగింపు

ఆర్టికల్ 19 - వాక్ స్వేచ్ఛ

ఆర్టికల్ 20 - నేరాల శిక్షకు సంబంధించి రక్షణ

ఆర్టికల్ 21 - జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ

ఆర్టికల్ 21 ఎ - 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్య హక్కు

ఆర్టికల్ 22 - కొన్ని సందర్భాల్లో అరెస్ట్ నుండి రక్షణ

ఆర్టికల్ 23 - మానవ అక్రమ రవాణా మరియు పిల్లల ఆశ్రమం

ఆర్టికల్ 24 - కర్మాగారాల్లో పిల్లలకు ఉపాధిని నిషేధించడం

ఆర్టికల్ 25 - మనస్సాక్షికి స్వేచ్ఛ మరియు ప్రవర్తన మరియు మతం యొక్క ప్రచారం

ఆర్టికల్ 26 - మతపరమైన వ్యవహారాల నిర్వహణకు స్వేచ్ఛ

ఆర్టికల్ 29 - మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ

ఆర్టికల్ 30 - విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి మైనారిటీ విభాగాల హక్కు

ఆర్టికల్ 31 - ఆస్తి హక్కు (44 వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది.)

ఆర్టికల్ 32 - హక్కుల అమలుకు నివారణలు

ఆర్టికల్ 36 - రాష్ట్ర నిర్వచనం

ఆర్టికల్ 38 - ప్రజా సంక్షేమం ప్రోత్సాహానికి రాష్ట్రం సామాజిక వ్యవస్థను రూపొందిస్తుంది.

ఆర్టికల్ 39 - స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం

ఆర్టికల్ 39 ఎ - సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం

ఆర్టికల్ 40 - గ్రామ పంచాయతీల సంస్థ

ఆర్టికల్ 41 - పని విద్య మరియు ప్రజల సహాయం పొందే హక్కు

ఆర్టికల్ 43 - కర్మ కార్లకు జీవనాధార వేతనాల ప్రయత్నం

ఆర్టికల్ 43 ఎ - పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం

ఆర్టికల్ 44 - పౌరులకు ఏకరీతి సివిల్ కోడ్

ఆర్టికల్ 45 - 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బాల్య సంరక్షణ మరియు విద్య కోసం రాష్ట్ర కేటాయింపు

ఆర్టికల్ 48 - వ్యవసాయ మరియు పశుసంవర్ధక సంస్థ

ఆర్టికల్ 48 ఎ - పర్యావరణం, అడవులు మరియు వన్యప్రాణుల రక్షణ

ఆర్టికల్ 49- జాతీయ స్మారక స్థలాలు మరియు వస్తువుల రక్షణ

ఆర్టికల్ 50 - ఎగ్జిక్యూటివ్ నుండి న్యాయవ్యవస్థ యొక్క వ్యక్తీకరణ

ఆర్టికల్ 51 - అంతర్జాతీయ శాంతి మరియు భద్రత

ఆర్టికల్ 51 ఎ - ప్రాథమిక విధులు

ఆర్టికల్ 52 - భారత రాష్ట్రపతి

ఆర్టికల్ 53 - యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్

ఆర్టికల్ 54 - రాష్ట్రపతి ఎన్నిక

ఆర్టికల్ 55 - రాష్ట్రపతి ఎన్నిక విధానం

ఆర్టికల్ 56 - రాష్ట్రపతి పదవీకాలం

ఆర్టికల్ 57 - తిరిగి ఎన్నికలకు అర్హత

ఆర్టికల్ 58 - అధ్యక్షుడిగా ఎన్నుకోబడటం

ఆర్టికల్ 59 - రాష్ట్రపతి నిబంధనలు

ఆర్టికల్ 60 - రాష్ట్రపతి ప్రమాణం

ఆర్టికల్ 61 - రాష్ట్రపతి అభిశంసనకు సంబంధించిన విధానం

ఆర్టికల్ 62 - అధ్యక్ష పదవిలో ఒక వ్యక్తిని నింపడానికి ఎన్నికల సమయం మరియు విధానం

ఆర్టికల్ 63 - భారత ఉపాధ్యక్షుడు

ఆర్టికల్ 64 - ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్-అఫిషియో చైర్మన్

ఆర్టికల్ 65 - రాష్ట్రపతి పదవి ఖాళీపై ఉపరాష్ట్రపతి పని

ఆర్టికల్ 66 - ఉపరాష్ట్రపతి ఎన్నిక

ఆర్టికల్ 67 - ఉపరాష్ట్రపతి పదవీకాలం

ఆర్టికల్ 68 - ఉపాధ్యక్ష పదవిని భర్తీ చేయడానికి ఎన్నికలు

ఆర్టికల్ 69 - ఉపరాష్ట్రపతి ప్రమాణం

ఆర్టికల్ 70 - ఇతర ఆకస్మిక పరిస్థితులలో రాష్ట్రపతి విధులను నిర్వర్తించడం

ఆర్టికల్ 71. - అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుల ఎన్నికలకు సంబంధించిన విషయాలు

ఆర్టికల్ 72 - క్షమాపణ యొక్క శక్తి

ఆర్టికల్ 73 - యూనియన్ యొక్క కార్యనిర్వాహక శక్తిని విస్తరించడం

ఆర్టికల్ 74 - రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి మంత్రుల మండలి

ఆర్టికల్ 75 - మంత్రులకు సంబంధించిన నిబంధనలు

ఆర్టికల్ 76 - అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా

ఆర్టికల్ 77 - భారత ప్రభుత్వ వ్యాపారం యొక్క ప్రవర్తన

ఆర్టికల్ 78 - రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం ప్రధానమంత్రి విధి

ఆర్టికల్ 79 - పార్లమెంట్ రాజ్యాంగం

ఆర్టికల్ 80 - రాజ్యసభ నిర్మాణం

Friday, April 29, 2022

జనరల్ క్యాటగిరీ ఖాళీలకు రిజర్వుడ్ అభ్యర్థులు కూడా అర్హులే: సుప్రీంకోర్టు

 *🔥జనరల్ క్యాటగిరీ ఖాళీలకు రిజర్వుడ్ అభ్యర్థులు కూడా అర్హులే: సుప్రీంకోర్టు🔥*


*▪️న్యూఢిల్లీ : అడ్మిషన్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. జనరల్ క్యాటగిరీకి చెందిన చివరి అభ్యర్థి కంటే ఎక్కువ మార్కులు సాధించిన రిజర్వుడ్ క్యాటగిరీ అభ్యర్థులు కూడా జనరల్ క్యాటగిరీలో సీట్లు, ఉద్యోగాలు పొందడానికి అర్హులవుతారని పేర్కొంది. ఇలాంటి అభ్యర్థులకు జనరల్ క్యాటగిరీలో అవకాశం కల్పించిన తర్వాత మెరిట్ ప్రకారం రిజ ర్వుడ్ క్యాటగిరీ సీట్లను, ఉద్యోగాలను సంబంధిత క్యాటగిరీ అభ్యర్థులతో నింపాలని పేర్కొన్నది. ఉదాహరణకు గ్రూప్-1 ఖాళీల భర్తీలో జనరల్ క్యాటగిరీలో పోస్టు సాధించిన మహేశ్కు 120 మార్కులు వచ్చాయనుకుందాం. ఈ క్యాటగిరీలో పోస్టు సాధించిన వారిలో మహేశ్ చివరి అభ్యర్థి. అయితే బీసీ క్యాటగిరీకి చెందిన రాజుకు 121 మార్కులు వచ్చాయనుకుందాం. సుప్రీం కోర్టు తాజా తీర్పును అనుసరించి రాజును కూడా జనరల్ క్యాటగిరీలోనే పోస్టుకు ఎంపిక చేయాలి. 120 కంటే తక్కు వ మార్కులొచ్చిన బీసీ అభ్యర్థులను మాత్రమే మెరిట్ ప్రకారం బీసీ క్యాటగిరీ పోస్టులకు ఎంపిక చేయాలి. ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీలకూ ఇదే నిబంధన వర్తిస్తుంది.*



Friday, April 22, 2022

భారతదేశంలోని పక్షుల అభయారణ్యం జాబితా

 *📌 భారతదేశంలోని పక్షుల అభయారణ్యం జాబితా*

 

 🔸 భరత్‌పూర్ పక్షుల అభయారణ్యం (కియోలాడియో నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు)➖ రాజస్థాన్


 🔸 చిల్కా సరస్సు పక్షుల అభయారణ్యం➖ పూరి (ఒడిశా)


 🔸 ఘట్‌ప్రభ పక్షుల అభయారణ్యం➖ కర్ణాటక


 🔸 కుమరకోమ్ పక్షుల అభయారణ్యం (వెంబనాడ్ పక్షుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు)➖ కేరళ


 🔸 కౌండిన్య పక్షుల అభయారణ్యం➖ చిత్తోర్ (ఆంధ్రప్రదేశ్)


 🔸 మయాని పక్షుల అభయారణ్యం➖ సతారా (మహారాష్ట్ర)


 🔸 నల్ సరోవర్ పక్షుల అభయారణ్యం➖ అహ్మదాబాద్ (గుజరాత్)


 🔸 నేలపట్టు పక్షుల అభయారణ్యం ➖ నెల్లూరు (ఆంధ్రప్రదేశ్)


 🔸 పులికాట్ సరస్సు పక్షుల అభయారణ్యం➖ తమిళనాడు


 🔸 రంగంటిట్టు పక్షుల అభయారణ్యం➖ కర్ణాటక


 🔸 సుల్తాన్‌పూర్ పక్షుల అభయారణ్యం➖ గుర్గావ్ (హర్యానా)


 🔸 సలీం అలీ పక్షుల అభయారణ్యం➖ చోరావ్ ద్వీపం (గోవా)


 🔸 వేదంతంగల్ పక్షుల అభయారణ్యం➖ తమిళనాడు

అల్లూరి సీతారామరాజు కి భారత ప్రభుత్వం అత్యున్నత గౌరవం

 *"అల్లూరి సీతారామరాజు కి భారత ప్రభుత్వం అత్యున్నత గౌరవం"*


*భీమవరం రానున్న భారత ప్రధాని*


*జులై 4, 2022 న భీమవరంలో  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఏడాది పాటూ జరిగే శ్రీ అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సంబరాలకు శ్రీకారం*


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి విశేష సహకారంతో ఫలించిన ది క్షత్రియ సేవా సమితి (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) వారి  ప్రయత్నాలు.


భారత ప్రభుత్వం 75 సం. ల స్వాతంత్ర్యం సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"* కార్యక్రమం ద్వారా "UNSUNG HEROS" ని గుర్తించి గౌరవిస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లకు... శ్రీ అల్లూరి సీతారామరాజు గారి సేవలను భారత ప్రభుత్వం గుర్తించి గౌరవించడం ద్వారా సుమారు 100 సంవత్సరాల తెలుగు ప్రజల ఆకాంక్షను గౌరవించడమే. ఇది తెలుగు ప్రజల విజయం ... దేశ భక్తునికి ఘన నివాళి.


కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి విశిష్ట కృషి మరియు ప్రత్యేక శ్రద్ధ వలన... తెలుగు రాష్ట్రల సాంస్కృతిక మంత్రిత్వ శాఖల వారి సౌజన్యం తో శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్షత్రియ సేవా సమితి (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) పలు కార్యక్రమాలు ఇటు తెలుగు రాష్ట్రాల్లో మొదలు పెట్టి తరువాత దేశ వ్యాప్తంగా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించడం జరిగింది.


*జులై 4, 2022 నుండి జులై 4, 2023* ... ఒక సంవత్సరం పాటూ వివిధ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు ...అటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ... ఇటు స్థానిక ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సేవా మరియు స్వచ్చంద సంస్థలు, అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్షత్రియ సేవా సమితులు, క్షత్రియ యువజన సంఘాలు, మహిళా సంఘాల సహాయ సహకరాలతో  ... *కుల, మత, ప్రాంత రహితంగా శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125 వ జయంతిని ఘనంగా నిర్వహించి...దేశం కోసం తృణప్రాయంగా తన ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుడు... విప్లవజ్యోతి శ్రీ అల్లూరికి విశిష్ట గౌరవాన్ని అందించాలని మా ప్రయత్నం.*


*మేము తలపెట్టిన కార్యక్రమాలు:*


1. *మే 7 వ తేదీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారు తన ట్విట్టర్లో శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 98వ వర్ధంతి కి నివాళులు అర్పించడం*. అంతేకాకుండా, పీఎంఓ కార్యాలయం ద్వారా మరియు ప్రముఖుల ద్వారా శ్రద్దాంజలి ఘటించడం.


2. *"మన్ కీ బాత్" కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి గురించి ప్రస్తావించడం.*


3. *మే 7, 2022*

-  రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ & క్షత్రియ సేవా సమితి (TS&AP) వారిచే రవీంద్రభారతిలో ఉదయం 11.00 గం. లకు తెలంగాణా ప్రభుత్వ ఘన నివాళి. శ్రీ కె టి రామారావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు మరియు ఇతర ప్రముఖులు పాల్గొంటారు.


- మే 7 సాయంత్రం 5 గం.లకు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు శ్రీమతి రోజా గారిచే వైజాగ్ లో ఘన నివాళి. పాండ్రంగి నుండి వైజాగ్ వరకు యువకుల బైక్ రాలీ. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇతర మంత్రులు కూడా పాల్గొంటారు. క్షత్రియ సేవా సమితి వైజాగ్ & క్షత్రియ సేవా సమితి TS&AP కలసి ఇతర క్షత్రియ సేవా సమితుల, క్షత్రియ యువజన సంఘాలు మరియు స్వచ్చంద సంస్థల సహకారంతో చేస్తున్న కార్యక్రమం.


*జులై 4, 2022 to జులై 4, 2023* ( 125 వ జయంతి జాతీయ సంబరాలు)


1. *జులై 4, 2022 :* 125వ జయంతి సందర్భంగా శ్రీ అల్లూరి సీతారామరాజు గారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారిచే ఘన నివాళి. *ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు భీమవరం పట్టణంలో భారీ బహిరంగ సభా ముఖంగా అల్లూరి కి ఘన నివాళి*. 


- అల్లూరి సీతారామరాజు గారి స్వగ్రామం మోగల్లు గ్రామంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం సహాయంతో... ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి చేతుల మీదుగా చారిత్రాత్మక మైన నిర్మాణం (Land mark Monument) జాతికి అంకితం.  (Virtual Launch from Bhimavaram meeting)


- మోగల్లు గ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు గారు బాల్యంలో గడిపిన ఇంటిని రీ మోడల్ చేసి, శ్రీ అల్లూరి సీతారామరాజు ధ్యాన మందిరం గా జాతికి అంకితం. అల్లూరి జీవిత చరిత్ర మరియు విశేషాల నిక్షిప్తీత.


తద్వారా అల్లూరి స్వగ్రామం మోగల్లు ఒక  ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా మారే అవకాశం.


2. అల్లూరి సీతారామరాజు గారి  తల్లి స్వగ్రామం మరియు ఆయన పుట్టిన పాండ్రంగి గ్రామంలో ఆయన ఆనవాళ్లను పునరుద్ధరించి కాపాడుకోవడం.


3. రాష్ట్ర మరియు కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో, కృష్ణదేవి పేట లో ఉన్న శ్రీ అల్లూరి సీతారామరాజు ఉద్యానవనం సుందరీకరణ పనులు. 


4. శ్రీ అల్లూరి సీతారామరాజు గారు తనకు తానుగా బ్రిటీష్ ప్రభుత్వానికి లొంగిపోయిన మంప గ్రామం కు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేయడం. ఏ చెరువు ఒడ్డున అయితే లొంగిపోయారో, ఆ చెరువు సుందరీకరణ మరియు చెరువు మధ్యలో శ్రీ అల్లూరి విగ్రహ ప్రతిష్ఠ.


5. *ఆగస్ట్ 22, 2022*- *రంప తిరుగుబాటుకు 100 సంవత్సరాలు*. ఆగస్ట్ 22, 1922 న చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి తో మన్యం తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు. ఆగస్ట్ 22, 2022 న చింతపల్లి నుండి ర్యాలీ. చింతపల్లి పోలీస్ స్టేషన్ ఆనవాళ్లను పునరుద్ధరించడం


6. మన్యం లో శ్రీ అల్లూరి సీతారామరాజు గారి విప్లవ ఆనవాళ్లను పునరుద్ధరించడం. రాజవొమ్మంగి, అడ్డతీగల, నరసీపట్నం ... ఇలా అల్లూరి చరిత్ర తో ముడిపడిన వివిధ ఆనవాళ్లను కాపాడుకోవడం.


7. శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రను 15 ని.లు నిడివి గల 3D అనిమేషన్ చిత్రం నిర్మాణం మరియు అల్లూరి విశిష్టతను తెలిచేస్తూ రాంభట్ల నృసింహా చారి గారి రచనలో మాధవపెద్ది సురేష్ గారి సంగీత సారధ్యంలో ఒక అద్భుతమైన పాట జాతికి అంకితం.


8. ముఖ్యంగా... శ్రీ అల్లూరి సీతారామరాజు గారితో కలసి పనిచేసిన పలు వీరుల (గంటం దొర, మల్లు దొర, గోకిరి ఎర్రేసు, అగ్గిరాజు....) కుటుంబాలను గుర్తించి, వారి ఆర్ధిక స్థితి గతులు తెలుసుకుని... వారి కుటుంబాలను ఆర్ధికంగా...సామాజికంగా ఆదుకుని శాశ్వత పరిష్కారం అందించడం. మన కోసం, మన మనుగడ కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుల కుటుంబాలను ఆదుకోవడం మనందరి బాధ్యత అని మా భావన.


9. మే7, 2023 - దేశ వ్యాప్తంగా ఇటు కేంద్ర మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలచే అధికారిక శ్రద్ధాంజలి.


10. జులై 4, 2023 - లంబసింగి ప్రాంతంలో 35 కోట్ల తో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న *స్వాతంత్ర్య సమరయోధుల* మ్యూజియం జాతికి అంకితం ద్వారా సంవత్సరం పాటూ నిర్వహించ తలపెట్టిన శ్రీ అల్లూరి సీతారామరాజు125 వ జయంతి జాతీయ సంబరాలు ముగుస్తాయి.


అంతే కాకుండా... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి ద్వారా తెలుగు ప్రజల ఆకాంక్షను క్షత్రియ సేవా సమితి (TS&AP) వారు గౌ. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారికి విన్నవించడం జరిగింది:


1. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పార్లిమెంట్ లో ప్రతిష్టించడం

2. విశాఖపట్నం లో రానున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం

3. భావి తరాలకు స్ఫూర్తిదాయకమైన మన్యం తిరుగుబాటు ను దేశ వ్యాప్తంగా అన్ని సిలబస్ లో పాఠ్యంసంగా చేయాలని కోరడం జరిగింది.


మేము తలపెట్టున ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ ... మా టీమ్ కి మీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని... ఒక కుటుంబం లా అందరం కలిసి ... ఒక వేడుకగా ప్రతీ కార్యక్రమం జరుపుకుందాం. మీ అమూల్యమైన సూచలను, సలహాలను అందించి మాకు మరింత బలం చేకూర్చాలని మనవి.


దేశభక్తి ని, దైవభక్తి ని విడివిడిగా చూడలేము అని నమ్మిన ఆ మహనీయుని గౌరవించడం అంటే దేశాన్ని, దైవాన్ని సమానంగా గౌరవించడమే. 


చివరిగా ...  ఈ సంవత్సరం కాలంలో శ్రీ అల్లూరి సీతారామరాజు మరియు వారితో పాటూ మన్యం తిరుగుబాటు లో పాల్గొని ... తమ కుటుంబ భాధ్యతలను పక్కనపెట్టి ... మన కోసం, మన భవిష్యత్తు కోసం త్యాగం చేసిన వారి కుటoబీకులను గౌరవించడం, ఆదుకోవడం కూడా మా ప్రణాళికలో ముఖ్య భాగం. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం పై గిరిజన హక్కులకోసం, దేశ స్వేచ్చ కోసం పూరించిన సమర శంఖారావం, విప్లవ సాయుధ పోరాటం *"మన్యం తిరుగుబాటు"* మూడు వందల సామ్.ల భారత స్వాతంత్ర్య చరిత్ర లో స్వర్ణలిఖితం. ఛత్రపతి శివాజీ తరువాత జరిగిన ఏకైక గెరిల్లా యుద్ధం. 100 సం. ల క్రితం బ్రిటీష్ ప్రభుత్వం ఆరోజుల్లోనే 40 లక్షలు ఖర్చుపెట్టడం, సుమారు 2300 సాయుధ బ్రిటీష్ దళాల ను మన్యంలో మోహరించడం మన్యం తిరుగుబాటు యొక్క ప్రత్యేకతను, ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. ఇటువంటి చారిత్రాత్మక పోరాటాన్ని జరిపిన తెలుగు పౌరషాన్ని ప్రతి ఒక్కరికీ తెలియచేయడo తెలుగు వాడిగా...ఒక భారతీయుడిగా మనకి గౌరవం...గర్వకారణం.


*భారత్ మాతా కి జై !! జై హింద్ !!*


మీ భవదీయులు


పేరిచెర్ల నాగరాజు.            నడింపల్లి నాని రాజు

అధ్యక్షులు.                       ప్రధాన కార్యదర్శి

మరియు... కమిటీ సభ్యులు

క్షత్రియ సేవా సమితి ( తెలంగాణ & ఆంధ్రప్రదేశ్)

హైదరాబాద్.


Note: అనుకోని వర్షాభావం వలన కానీ, రవాణా సౌకర్య లోపాల వలన ఏదైనా ఇబ్బంది వస్తే తప్ప... ప్రధాని ప్రోగ్రాం భీమవరం లో కంఫర్మ్.

BANKS IN INDIA

 ✅BANKS IN INDIA

    🧿First bank in India

💠Bank of Hindustan (1770) 


🧿First Bank managed by Indians 

💠Oudh Commercial Bank 


🧿First Bank with Indian capital 

💠Punjab National Bank (Founder - Lala Lajpat Rai)


🧿First Foreign Bank in India

💠HSBC 


🧿First bank to get ISO certificate

💠Canara Bank 


🧿First Indian bank outside India

💠Bank of India 


🧿First Bank to introduce ATM

💠HSBC (1987, Mumbai) 


🧿First Bank to have joint stock public bank (Oldest)

💠Allahabad Bank 


🧿First Universal bank

💠ICICI Bank


🧿First bank to introduce saving account

💠Presidency Bank (1833) 


🧿First Bank to introduce Cheque system

💠Bengal Bank (1833) 


🧿First bank to give internet banking facility

💠ICICI Bank


🧿First bank to sell mutual funds

💠State Bank of India 

          


🧿First bank to issue credit cards

💠Central Bank of India 


🧿First Rural Regional Rural Bank (Grameen Bank)

💠Prathama Bank (sponsored by Syndicate Bank) 


🧿First bank to get "in principle" banking license

💠IDFC and Bandhan Bank 


🧿First Bank to introduce merchant banking in India

💠Grind lays bank 


🧿First bank to introduce block chain technology

💠ICICI Bank


🧿First bank to introduce voice biometric

💠Citi Bank 


🧿First bank to introduce robot in banking service

💠HDFC Bank


🧿first bank in India to allow video KYC

💠Kotak Mahindra Bank


🧿first bank to introduce Iris Scan Authentication feature for Aadhaar based transactions through its micro ATM tablets

💠Axis Bank


🧿Largest public sector bank in India

💠State Bank of India 


🧿Largest private sector bank in India

💠ICICI Bank


🧿Largest foreign bank in India

💠Standard Chartered Bank 


🧿Bank with more branches in India

💠State Bank of India

Friday, April 15, 2022

Daily Current Affairs - One Liners (15-04-2022)

 Daily Current Affairs - One Liners (15-04-2022)


1, తమిళనాడు ప్రభుత్వం డాక్టర్ BR అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14 ను ఈ సంవత్సరం నుండి "సమానతా దినోత్సవం"గా జరుపుకొనుంది.


2, 20వ భారత్-ఫ్రాన్స్ జాయింట్ స్టాఫ్ చర్చలు పారిస్‌లో జరిగాయి. ఈ చర్చల ద్వారా రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించినది.


3, పత్తి ధరలను తగ్గించేందుకు, పత్తి దిగుమతులపై అన్ని కస్టమ్స్ సుంకాలను మినహాయించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.


4, కోటక్ మహీంద్రా బ్యాంక్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ అయిన Kotak FYN ను ప్రారంభించింది. ఇది వ్యాపార బ్యాంకింగ్ మరియు కార్పొరేట్ క్లయింట్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫారమ్.


5, ఇటీవల, సుప్రీంకోర్టు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) ని ఫిల్మ్ మేకింగ్ మరియు ఎడిటింగ్‌కు సంబంధించిన కోర్సుల నుండి వర్ణాంధత్వంతో బాధపడుతున్న అభ్యర్థులను మినహాయించవద్దని ఆదేశించింది. దానికి బదులుగా దాని పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని కోరింది.


6, గార్మెంట్ మరియు టెక్స్‌టైల్ రంగానికి రూ. 10,683 కోట్ల ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహకం (PLI) పథకం కింద, భారత కేంద్ర ప్రభుత్వం 61 కంపెనీల ఆర్థిక సహాయానికి ఆమోదం తెలిపింది.


7, మాజీ సైనికులు మరియు యువకుల కోసం ఉద్దేశించిన "హిమ్ ప్రహరీ" పథకాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకం ఉత్తరాఖండ్ నుండి ప్రజల వలసలను అరికట్టడానికి ఉద్దేశించబడింది.


8, 2022-23 ఆర్థిక సంవత్సరానికి, భారతదేశ జిడిపి అంచనాను ప్రపంచ బ్యాంకు 8.7 శాతం నుండి 8 శాతానికి తగ్గించింది







అంబేద్కర్ జయంతి

 *అంబేద్కర్ జయంతి*

(14ఏప్రిల్ )


ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న Dr.B.R.అంబేద్కర్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు...


(దయచేసి చదవండి - భావితరాలకు తెలియజేయండి)


✿✿ జీవన చిత్రం ✿✿


☞ తల్లిదండ్రులు :- తల్లి భీమాబాయి సక్పాల్, తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్ బ్రిటీష్ ఆర్మీలో సుబేదార్ గా పని చేసేవారు. వీరి స్వంత గ్రామం అంబెవాడ గ్రామం, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.


☞ జననం:- 14 ఏప్రిల్ 1891


☞ ప్రాంతం :- మౌవ్, సెంట్రల్ ప్రావిన్స్ (ప్రస్తుత మధ్య ప్రదేశ్) ( రాంజీ సక్పాల్ గారు ఉద్యోగం చేస్తున్న ప్రాంతం)


☞ వివాహం:- 

రమాబాయి అంబేద్కర్ 1906 లో వివాహం జరిగింది, ఆయనకు ప్రతి విజయంలో పూర్తి సహకారం అందించారు, తాను చిరిగిన దుస్తులు ధరిస్తూ కూడా బాబాసాహెబ్ చదువుకు, ఆయన చేసే కార్యక్రమాలకు ఏనాడూ ఆటంకం కాలేదు,చివరికి రక్త హీనతతో 1935 సంవత్సరంలో రమాబాయి చనిపోయారు.


సవిత అంబేద్కర్ :- 

అసలు పేరు శారద కబీర్, రాజ్యాంగ రచన సమయంలో నిద్రలేమి, కాళ్ళలో కండరాల సమన్య వలన దెబ్బ తిన్న ఆరోగ్యాన్ని దగ్గర ఉండి చూసుకోవడం కోసం 15 ఏప్రిల్ 1948 న వివాహం చేసుకున్నారు..


☞ డా. బి. ఆర్. అంబెడ్కర్ మరణం:- రాజకీయ పరిస్థితులపై, తన అనుచరులు అనుకున్న వారి వ్యవహర శైలి వలన తీవ్రమైన మానసిక వత్తిడిని అనుభవించారు,నిద్రలేమి,మానసిక వత్తిడి వలన కలిగిన తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధ పడ్డారు.


తన ఆఖరి పుస్తకం "Buddha and his Dhamma" పూర్తి చేసిన మూడు రోజులకు, 1956 డిసెంబర్ 06 న నిద్రలోనే పరినిర్వాణం చెందారు.


☞✿ బాబాసాహెబ్ Dr.B.R అంబేద్కర్ గారి చదువులు - ప్రత్యేకతలు:- ✿☜


✍ మెట్రికులేషన్ -1908 

✍ B.A - (Politics and Economics) Bombay University in 1912 - అంటబడని కులాల నుండి మొట్టమొదటి గ్రాడ్యుయేట్

✍ M.A - (Economics - For his thesis ‘Ancient Indian Commerce’) in America in 1915.

✍ Ph.d - (Economics - For his thesis ‘The evolution of provincial finance in British India’) in Columbia University, America in 1917. - ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుండి మొట్టమొదటి డాక్టరేట్.

✍ D.Sc - (Thesis - ‘Problem of the Rupee - Its origin and its solution’) in London School of Economics in 1923. ఆర్ధిక శాస్త్రంలో D Sc తీసుకున్న మొదటి మరియు ఆఖరి భారతీయుడు

✍ M.Sc – (Economics – For his thesis ‘Provincial Decentralisation of Imperial Finance in British India’) London. - ఆర్ధిక శాస్త్రంలో మొదటి డబల్ డాక్టరేట్

✍ Bar-At-Law - Gray’s Inn in London, 1923. మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది

✍ Political Economics - Germany. 

✍ LLD - (Honoris) Columbia University, New York, For his achievements of leadership and authoring the Constitution of India. 

✍ D.Litt - (Honoris) Osmania University, Hyderabad, For his achievements, Leadership and writing the constitution of India.

✍ బాబాసాహెబ్ Dr.B.R అంబేద్కర్ గారు తన జీవిత కాలంలో 20000 పుస్తకాలు సేకరించారు., అమెరికా నుండి తిరిగి వచ్చే సమయంలో ఆయన పుస్తకాలు తీసుకొస్తున్న నౌకను జర్మనీ సబ్మెరైన్ దాడి చేసి ముంచేయడంతో దాదాపు 6000 పుస్తకాలు పోగొట్టుకున్నారు,ఆ సమయంలో బాబాసాహెబ్ చాలా బాధ పడ్డారు.


✿✿ తొమ్మిది భాషల్లో బాబాసాహబ్ పూర్తి ప్రావీణ్యత కలిగి ఉన్నారు ✿✿


- మరాఠీ 

- హిందీ

- ఇంగ్లీషు 

- గుజరాతీ

పాళీ (- పాళీ వ్యాకరణం మరియు నిఘంటువు కూడా రాసారు )

- సంస్కృతం 

- జర్మన్

- పార్శీ

- ఫ్రెంచ్


✿✿ బాబాసాహెబ్ Dr.B.R. అంబేద్కర్ గారి ఉద్యమ జీవితం ✿✿


☞☆ బాబాసాహెబ్ స్థాపించిన ఉద్యమ సంస్థలు:-


1. బహిషృిత హితకారిణి సభ :- జులై 20, 1924

2. సమత సైనిక్ దళ్ :- మార్చి 13, 1927


☞☆ బాబాసాహెబ్ స్థాపించిన రాజకీయ సంస్థలు:-


1. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ (ILP)-- ఆగస్టు 16, 1936

2. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (SCF)-- జులై 19, 1942 ( ILP నే SCF గా మార్చారు)

3. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) - అక్టోబరు 3, 1957 (బాబాసాహెబ్ అనారోగ్యం కారణంగా ఆయన తదనంతరం నెలకొల్పబడింది)


☞☆ బాబాసాహెబ్ స్థాపించిన విద్యసంస్థలు:


1. డిప్రెస్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సొసైటీ -- జూన్ 14, 1928

2. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ -- జూలై 08, 1945 

3. సిద్ధార్థ్ కాలేజి, ముంబై -- జూన్ 20, 1946 

4. మిళింద్ కాలేజీ, ఔరంగాబాద్ -- జూన్ 01, 1950


☞☆ బాబాసాహెబ్ స్థాపించిన ధార్మిక సంస్థ:


1. బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా -- మే 4, 1955


✿✿ బాబాసాహెబ్ నాయకత్వం వహించిన కొన్ని ముఖ్య ఉద్యమాలు ✿✿


- మహద్ చెరువు ఉద్యమం - 20/3/1927

- మొహాళీ (ఘులేల)తిరుగుబాటు - 12/2/1939

- అంబాదేవీ మందిరం ఆందోళన - 26/7/1927

- పూణే కౌన్సిల్ ఉద్యమం - 4/6/1946

- పర్వతీ ఆలయ ఉద్యమం - 22/9/1929

- నాగపూర్ ఆందోళన - 3/9/1946

- కాలారామ్ ఆలయ ఆందోళన - 2/3/1930

- లక్నౌ ఉద్యమం - 2/3/1947

- ముఖేడ్ ఉద్యమం - 23/9/1931


✿✿ బాబాసాహెబ్ స్థాపించిన పత్రికలు ✿✿


*మూక్ నాయక్ - జనవరి 31, 1920

*బహిషృత భారత్ - ఏప్రిల్ 3, 1927

* సమత - జూన్ 29, 1928

*జనత - నవంబరు 24, 1930

*ప్రభుద్ధ భారత్ - ఫిబ్రవరి 4, 1956


✿✿ బాబాసాహెబ్ ప్రత్యేకతలు దక్కిన గౌరవాలు✿✿


☞- బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు,ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే.

☞- లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి అవపోసన పట్టిన ఒకే ఒక్కడు బాబాసాహెబ్.

☞- ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు గల ప్రజా నాయకుడు బాబాసాహెబ్. 

☞- ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన 6గురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు.

☞- లండన్ విశ్వవిద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ Phd ని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి.

☞- తన ప్రమేయం లేదు కాబట్టి హిందూమతంలో పుట్టాను గానీ హిందూమతంలో మాత్రం చావను అని ఆయన బౌద్ధం తీసుకుంటే, మరో ఆలోచన లేకుండా 5లక్షల మంది బౌద్ధం తీసుకున్నారు.. ఇంతటి అభిమానం ఇంకే నాయకుడు పొంది ఉండడు. 


❤ అరుదైన గౌరవాలు


☞- భారత రత్న - ఇంత ప్రపంచ మేధావికి స్వతంత్ర్యం వచ్చిన 43 ఏళ్ళకు గానీ గుర్తించలేకపోయింది కులం రోగంతో కొట్టుకుంటున్న భారత ప్రభుత్వం. 


☞- కొలంబియా యూనివర్సిటీ ప్రకారం - ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన నాయకుడు. 


☞- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం విశ్వంలోనే అతిగొప్ప ఉద్యమ నిర్మాత.


☞- CNN, IBN, History channel నిర్వహించిన సర్వే ప్రకారం THE GREATEST INDIAN.


*‍‍‌‍‌‍‌బాబాసాహెబ్ గురించి బయటకు తెలియకుండా దాయబడుతున్న అంశాలు 


యావత్ ప్రపంచం బాబాసాహెబ్ ను నవభారత నిర్మాతగా,భారతదేశ చరిత్రలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన ఒక అత్యంత ప్రభావశీలుడైన నాయకునిగా గుర్తిస్తుంటే,భారతదేశంలో మాత్రం ఆయనను ఒక కులానికి నాయకునిగా,ఒక వర్గానికి నాయకుడిగా చూస్తోంది.సంఘ్ విద్రోహులు బాబాసాహెబ్ అందరి నాయకుడు అంటూనే ఆయన గొప్పదనం తెలియజేయకుండా కేవలం ఆయనను రాజ్యాంగ రచయితగా మాత్రమే పరిమితం చేసి, హిందూ మత ఉద్ధారకునిగా ప్రచారం చేస్తూ హిందూ ఓటు బ్యాంకు పెంచుకోవాలని కుట్ర పన్నుతోంది.ఇది బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని పూర్తిగా తుడిచి పెట్టే కుట్ర.


ఇలాంటి సమయంలో బాబాసాహెబ్ నిజమైన గొప్పతనాన్ని తెలుసుకోకపోతే,మనువాద వక్రీకరణలే చరిత్రగా మారే ప్రమాదం ఉంది.మన భావితరాలను ఈ వక్రీకరణల నుండి కాపాడుకోకపోతే,అంబేద్కరిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టినవారమౌతం.


✿✿☆ వివిధ రంగాల్లో బాబాసాహెబ్ కృషి - గొప్పతనాలు - వాటి ఫలితాలు .. ☆✿✿


✿ బాబాసాహెబ్ - మహిళా హక్కులు ✿


☞✓ హిందూకోడ్ బిల్లు - మహిళల విధ్య, ఆర్థిక సమానత్వం కోసం (హిందువులు తీవ్రంగా వ్యతిరేకించినందున పార్లమెంటు నిరాకరించడంతో బాబాసాహెబ్ మహిళా హక్కుల కోసం తన మంత్రి పదవినే వదిలేసారు.)

☞✓ పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనాలు. 

☞✓ మహిళలకు గర్భధారణ సమయంలో 8 వారాల ప్రత్యేక సెలవు (Maternity leave).

☞✓ పని ప్రాంతాలలో మహిళకు ప్రత్యేక సౌకర్యాల కోసం పథకాలు.

☞✓ స్త్రీ శిశు సంక్షేమ చట్టం - ఇది తరువాతి కాలంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆవిర్భావానికి దారి తీసింది.


✗✗✗ అయినప్పటికీ మనువాదంలో మునిగి తేలుతున్న స్త్రీ సమాజం ఏనాడూ బాబాసాహెబ్ పేరును కూడా తలుచుకోదు,మహిళా హక్కులంటూ గొంతు చించుకునే మహిళా సంఘాలు బాబాసాహెబ్ గురించి ఒక్క మాట కూడా తమ సంఘాల వారికి చెప్పరు ✗✗✗


✿ బాబాసాహెబ్ - కార్మికుల హక్కులు ✿


☞✓ 8 గంటల పనిదినాలు - 7వ Indian Labour Conference, నవంబరు 27, 1942 లో 14 నుండి 8 గంటలకు కుదించారు.

☞✓ ESI (Employee State Insurance) సౌకర్యం :- కార్మికుల ఆరోగ్య భద్రత కోసం (తూర్పు ఆసియాలోనే మొదటిది.

☞✓ ఇండియన్ ఫ్యాక్టరీల చట్టం :- పని ప్రదేశంలో నిర్ధిష్ట విధానాలు,జవాబుదారీతనం కోసం.

☞✓ కరువు భత్యం (Dearness Allowance)పెరిగిన నిత్యావసర ఖర్చులను భరించేందుకు వీలుగా. 

☞✓ కనీస వేతనం ఉండే విధంగా చర్యలు.

☞✓ కేంద్ర కార్మిక సంఘాల (సవరణ) చట్టం :- 1926 చట్టం కేవలం కార్మిక సంఘాలను రిజిష్ట్రేషను చేయడం మాత్రమే చెప్పింది.8 నవంబరు 1943న సవరణ చట్టం తీసుకొచ్చి పూర్తి విధివిధానాలు రూపొందించారు బాబాసాహెబ్.

☞✓ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం.


✗✗✗ కానీ ఏనాడూ బాబాసాహెబ్ పేరు కూడా ఎత్తకుండా కార్మికులను మాయలో ఉంచుతారు ఈ అగ్రకులాల నాయకత్వంలో ఉన్న కమ్యూనిస్టులు.✗✗✗


✿ బాబాసాహెబ్ - రైతుల కోసం ✿


☞✓ నీటిపారుదల సౌకర్యాల పితామహుడు:- హిరాకుడ్ ప్రాజెక్టు,దామోదర్ నదీలోయ ప్రాజెక్టు, సోన్ నది లాంటి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల డిజైన్ దగ్గర నుండి పూర్తి చేసేదాకా బాబాసాహెబ్ కృషి ఉంది.భారతదేశ చరిత్రలో అనుకున్న ఖర్చు మరియు అనుకున్న సమయంలో పూర్తయిన నీటిపారుదల జలవిద్యుత్ ప్రాజెక్టులు ఇవే.

☞✓ మెరుగైన నీటిపారుదల కోసం Central Waterway and Irrigation Commission (CWIRC) ఏర్పాటు చేసారు.

☞✓ జలవనరుల నుండి విధ్యుత్తుత్పత్తిని క్రమబద్ధం చేయడం కోసం Central technical power board స్థాపించారు. 

☞✓ ఇప్పటికీ సమస్యలు లేకుండా విజయవంతంగా నడుస్తూ దేశంలో విధ్యుత్తు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న "గ్రిడ్ వ్యవస్థ " బాబాసాహెబ్ ఆలోచనే.


✗✗✗ మొక్షగుండం విశ్వేశ్వరయ్య, నెహ్రూ, పటేల్ ల వల్లనే ఇవన్నీ సాధ్యమైనాయంటూ బాబాసాహెబ్ పేరు కూడా తలవవు ఈ ప్రభుత్వాలు.✗✗✗


✿ బాబాసాహెబ్-నిరుద్యోగం-స్వయం వికాసం ✿


☞✓ ఇప్పుడు నిరుద్యోగులకు అత్యంత సహాయకరంగా నిలుస్తున్న "ఎంప్లాయిమెంట్ ఎక్సచేంజీలు" (Employement exchange) బాబాసాహెబ్ స్థాపించినవే.

☞✓ భారత దేశంలో సాంకేతిక విద్య అందుబాటులో లేని కారణంగా నిరుద్యోగులను యూనిట్ గా చేసుకుని ITI లాంటి సంస్థలు ఏర్పాటు చేసి అవసరం అయితే వారిని విదేశాలకు పంపి శిక్షణ ఇప్పించాలని ప్రతిపాదించారు బాబాసాహెబ్.


✿ భారతదేశ ఆర్థిక ప్రగతికి బాబాసాహెబ్ కృషి ✿


☞✓ రెండవ ప్రపంచ యుద్ధం సమయానికి ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న భారతదేశాన్ని మళ్ళీ పునర్నించే ప్రయత్నంలో భాగంగా నియమించిన Reconstruction Commitee of Council లో బాబాసాహెబ్ సభ్యులుగా ఉన్నారు.నీటిపారుదల మరియు విధ్యుత్తుత్పత్తి ద్వారా ఆర్థిక ప్రగతికి బాటలు వేసారు.

☞✓ ఇప్పటిదాకా నివేదికలు సమర్పించిన 13 ఆర్థిక సంఘాల (Finance Commisions) నివేదికలు కూడా బాబాసాహెబ్ Phd thesis అయిన "The Evolution of Provincial Finance in British India" నుండి సేకరించినవే.

✍✓ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఘోరంగా దెబ్బ తీస్తున్న ఆర్థిక మాంద్యాలు కూడా భారతదేశాన్ని ప్రభావితం చేయలేక పోవడానికి ముఖ్య కారణం అయిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపన పూర్తిగా బాబాసాహెబ్ కృషి ఫలితమే.రిజర్వు బ్యాంకు స్థాపన కోసం ఏర్పాటు చేసిన హల్టన్ అండ్ యంగ్ కమీషన్ పూర్తిగా బాబాసాహెబ్ రాసిన "The Problem of the Rupee – it’s origin and it’s solution.” ని అనుసరించింది.


✗✗✗ మరి ఈనాడు చూస్తే కరెన్సీ నోటు మీద గాంధీ బొమ్మ మరియు బ్యాంకుల్లో రవీంద్రనాద్ ఠాగోర్ ల ప్రవచనాలే కనిపిస్తాయి.నిజానికి వీరి ఇద్దరి సహకారం శూన్యం.


✿ బాబాసాహెబ్ - హేతువాదం - సామాజిక ఉద్యమాలు ✿


☞✓ భారతదేశం విజ్ఞానపరంగా ముందుకు వెళ్ళకుండా మూఢనమ్మకాలలో మగ్గుతూ ఉండడానికి ముఖ్యకారణం హిందూమతం అని నినదించి.ఈ రుగ్మతలు ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్న మనుధర్మాన్ని తగలబెట్టారు బాబాసాహెబ్.


☞✓ ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని ఎదుర్కోవడానికి హేతువాదం మాత్రమే సరిపోదు, ఒక హేతువాద భావనలు గల మరో సంస్కృతి సృష్టించాల్సిందే అని చెప్పి నవయానాన్ని ప్రభోధించారు బాబాసాహెబ్.


 కానీ ఈనాడు హేతువాదులం అని చెప్పుకునే ఏ అగ్రకులం వాడు బాబాసాహెబ్ పేరు తలవడానికి కూడ ఇష్టపడడు.


ఇలా మనువాద భావనలు నిండిన మన సమాజం బాబాసాహెబ్ ఈ దేశ వ్యవస్థకు అందించిన సహకారం పూర్తిగా విస్మరిస్తూ వస్తోంది.

 

*బాబాసాహెబ్ తన జీవిత కాలంలో నిర్వహించిన బాధ్యతలు.


ఒక గొప్ప సామాజిక శాస్త్రవేత్త..


ఒక ప్రఖ్యాత న్యాయకోవిదుడు..


ఒక విశిష్టమైన చరిత్రకారుడు..


ఒక ప్రతిష్టాత్మక ఆర్థిక శాస్త్రవేత్త...


ఒక అద్భుతమైన రచయిత..


ఒక తిరుగులేని ఉద్యమకారుడు..


ప్రజలను కట్టిపడేయగల వక్త.. 


ప్రపంచంలో మరెవరూ చదవలేనన్ని డిగ్రీలను అందుకున్న ప్రపంచ మేధావి..


భారత రాజ్యాంగ నిర్మాత.


అన్నిటికంటే ముఖ్యంగా ఒక మానవతావాది.


స్వేచ్చ, సమానత్వ స్థాపన కోసం,

తపన పడ్డ సామాజిక విప్లవకారుడు.


భారత భూమిపై నడయాడిన ఒక "గ్రేటెస్ట్ ఇండియన్"


"జీవితం సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరం లేదు, గొప్పగా ఉండాలి అని బాబాసాహెబ్ చెప్పిన మాటలు ఆయనకే వర్తించాయి.


 పైన విషయాలు కొన్ని మాత్రమే, బాబాసాహెబ్ గురించీ మీరు కూడా మీకు తెలిసిన కొన్ని జోడించి, మన ఇంట్లో పిల్లలకు ఈ విషయాలు అవగాహన కల్పించండి. కుదిరితే మీ దగ్గర లోని SC,ST,BC హాస్టల్ లకు ఒక సాయంత్రం వెళ్ళి బాబాసాహెబ్ నిజమైన గొప్పతనాన్ని మన తరువాతి తరాలకు వివరించండి.


✊ భారతదేశ సామాజిక ఉద్యమ పితామహుడు, ప్రపంచ మేధావి, నిజమైన ప్రజా నాయకుడు.


నేను హిందువుగా పుట్టినను... అది నా చేతుల్లో లేదు. కానీ... హిందువుగా మాత్రం చావను... చావను... చావను. Dr.B.R అంబేద్కర్.

Tuesday, August 10, 2021

ఓటరు నమోదుకు మళ్లీ అవకాశం.*

 *ఓటరు నమోదుకు మళ్లీ అవకాశం.*


*18 ఏళ్లు నిండిన వారు అర్హులు.*


*షెడ్యూల్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి.*


అమరావతి: కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది.            


జనవరి 1,2022 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని పేర్కొంది. 


వారితోపాటు గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికీ అవకాశం కల్పించారు.                   


ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.   


షెడ్యూల్‌ ఇలా.. 

► ఆగస్టు 9 నుంచి అక్టోబర్‌ 31 వరకు ఇంటింటి ఓటరు జాబితా పరిశీలన.


► నవంబర్‌1న ముసాయిదా ఓటరు జాబితా విడుదల.

► నవంబర్‌ 30 వరకు అభ్యంతరాల స్వీకరణకు అనుమతి.

► నవంబర్‌ 20, 21 తేదీల్లో ఓటరు నమోదుపై ప్రచార కార్యక్రమం.

► అదే తేదీల్లో పోలింగ్‌  కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్‌ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. 

► ఆ పోలింగ్‌ కేంద్రాల్లోనే  దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులున్నా సరిచేసుకోవచ్చు.  


http://www.nvsp.in లేదా వోటర్‌ హెల్ప్‌లైన్‌ అనే మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 


► డిసెంబర్‌ 20 నాటికి అభ్యంతరాల పరిశీలన పూర్తి.

► జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదల. 


ఓటర్ల జాబితా సిద్ధం చేయండి.


ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఎంఎం నాయక్‌ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు,నగర పంచాయతీల కమిషనర్లను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.              


రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రచురించాలని ఆయన పేర్కొన్నారు.              


దీంతో నగర పంచాయతీల్లో అన్ని వార్డుల్లో.. 


మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులకు ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నారు.

Friday, August 6, 2021

రాజీవ్ ఖేల్ రత్న

 " *రాజీవ్ ఖేల్ రత్న* " award పేరు ను " *మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న* " గా మార్చాలని నిర్ణయించిన ప్రధాని మోడి.👍🏻👌🏻

Wednesday, August 4, 2021

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో(2021) నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యులు.....*

 🌹🌹 *ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో(2021) నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యులు.....*



🌻AP-ICET

దరఖాస్తుకు చివరి తేది: 14-08-2021

పరీక్ష తేది:: 17-09-2021 & 18-09-2021


🌻AP-ECET

దరఖాస్తుకు చివరి తేది: 12-08-2021

పరీక్ష తేది:: 19-09-2021


🌻AP-PGECET

దరఖాస్తుకు చివరి తేది: 19-08-2021

పరీక్ష తేది:: 27-09-2021 to 30-09-2021


🌻AP-EdCET

దరఖాస్తుకు చివరి తేది: 17-08-2021

పరీక్ష తేది:: 21-09-2021


🌻AP-LAWCET

దరఖాస్తుకు చివరి తేది: 20-08-2021

పరీక్ష తేది:: 22-09-2021

Friday, July 30, 2021

తెలుగు సహా 5 భాషల్లో ఇంజినీరింగ్‌ బోధ

 PM MODI: తెలుగు సహా 5 భాషల్లో ఇంజినీరింగ్‌ బోధన!


నూతన విద్యావిధానం విప్లవాత్మకమన్న ప్రధాని మోదీ


దిల్లీ: దేశంలోని పేద, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను మరింత సరళీకృతం చేయడంలో భాగంగా స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్‌ కోర్సులను ఐదు భాషల్లో బోధించనున్నట్టు వెల్లడించారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యా బోధన ఐదు భారతీయ భాషల్లో ప్రారంభం కాబోతుండటం సంతోషకరమన్నారు. హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో విద్యా బోధన ప్రారంభమవుతుందని చెప్పారు. జాతీయ నూతన విద్యా విధానం-2020 అమలులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కీలక ప్రసంగం చేశారు. ఇంజినీరింగ్‌ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ఓ టూల్‌ను కూడా అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ప్రాంతీయ భాషల్లో విద్యానభ్యసించబోతున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ దేశ యువత ఆశయాలకు నూతన విద్యావిధానం అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి  ఈ కొత్త విధానం దోహదపడుతుందని, దాంతో యువత తమ కలలను సాకారం చేసుకునే విషయంలో స్వయంగా ముందుకెళ్లగలరని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘నూతన విద్యా విధానం ద్వారా యువతకు దేశం పూర్తిగా తమ వెంటే ఉందని, తమ ఆకాంక్షలకు మద్దతు ఇస్తోందన్న భరోసా కలుగుతుంది. మాతృభాషల్లో విద్యను అందించడం దీంట్లో అత్యంత కీలకం. కొత్త విద్యా విధానం యువత కలలను సాకారం చేసే దిశగా చేయూతనందిస్తుంది. విద్యార్థుల్లో ఉండే అనవసర ఒత్తిడిని దూరం చేస్తుంది. కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది. ఈ విద్యా విధానం విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకొనేలా ప్రోత్సహిస్తుంది. యువతకు భవిష్యత్తు ఆధారిత కలలను సాకారం చేసే విద్య అవసరం. 21వ శతాబ్దపు యువత తమదైన శైలిలో కొత్త దారులను వెతుక్కొనేందుకు స్వేచ్ఛ, ప్రోత్సాహం ఇవ్వాలి. కరోనా కారణంగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినప్పటికీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో బోధనా పద్ధతిని త్వరగా అలవాటు చేసుకున్నారు. ఒకప్పుడు మన విద్యార్థులు పైచదువులకు విదేశాలకు వెళ్లేవారు. కానీ, త్వరలో దేశంలోనే ప్రపంచ స్థాయి విద్యను అందుకొనే సదుపాయం కలుగుతుంది. విద్యార్థులు తమ మాతృభాషలోనే విద్యనభ్యసించేందుకు ఈ విధానం అవకాశం కల్పిస్తుంది. వారికి భాషలు ఎంపిక చేసుకొనే సౌలభ్యం ఉంది. ఏ తరమైతే నూతన జాతీయ విద్యా విధానం ద్వారా లబ్ధి పొందుతుందో.. అదే తరం రేపు దేశాన్ని ముందుకు నడిపిస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు. 

ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించే మహాయజ్ఞంలో నూతన విద్యావిధానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఈ-లెర్నింగ్ పోర్టల్ ‘దీక్ష (DIKSHA)’ గురించి ప్రస్తావించిన మోదీ.. నిత్యం దాదాపు ఐదు కోట్ల హిట్స్ సాధిస్తోందని చెప్పారు. ఈ ఏడాదిలో మొత్తం 2300 కోట్ల వీక్షణలు వచ్చాయని తెలిపారు. దేశ యువత మార్పుకు సిద్ధంగా ఉన్నారని, వారిని కలలను నేరవేర్చడానికి ఈ దేశం వారికి అండగా ఉంటుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.

Wednesday, July 21, 2021

📌Computer Shortcut Key📌

 📌Computer Shortcut Key📌



Ctrl + A - Select All

Ctrl + B - Bold 

Ctrl + C - Copy 

Ctrl + D - Fill

Ctrl + F - Find

Ctrl + G - Find next instance of text

Ctrl + H - Replace

Ctrl + I - Italic

Ctrl + K - Insert a hyperlink

Ctrl + N - New workbook

Ctrl + O - Open

Ctrl + P - Print

Ctrl + R - Nothing right

Ctrl + S - Save

Ctrl + U - Underlined

Ctrl + V - Paste

Ctrl W - Close

Ctrl + X - Cut

Ctrl + Y - Repeat

Ctrl + Z - Cancel

F1 - Help

F2 - Edition

F3 - Paste the name

F4 - Repeat the last action

F4 - When entering a formula, switch between absolute / relative references

F5 - Goto

F6 - Next Pane

F7 - Spell Check

F8 - Extension of the mode

F9 - Recalculate all workbooks

F10 - Activate Menubar

F11 - New graph

F12 - Save As

Ctrl +: - Insert the current time

Ctrl +; - Insert the current date

Ctrl + "- Copy the value of the cell above

Ctrl + '- Copy the formula from the cell above

Shift - Offset Adjustment for Additional Functions in the Excel Menu

Shift + F1 - What is it?

Shift + F2 - Edit cell comment

Shift + F3 - Paste the function into the formula

Shift + F4 - Search Next

Shift + F5 - Find

Shift + F6 - Previous Panel

Shift + F8 - Add to the selection

Shift + F9 - Calculate the active worksheet

Shift + F10 - Popup menu display

Shift + F11 - New spreadsheet

Shift + F12 - Save

Ctrl + F3 - Set name

Ctrl + F4 - Close

Ctrl + F5 - XL, size of the restore window

Ctrl + F6 - Next Workbook Window

Shift + Ctrl + F6 - Previous Workbook Window

Ctrl + F7 - Move window

Ctrl + F8 - Resize Window

Ctrl + F9 - Minimize the workbook

Ctrl + F10 - Maximize or Restore Window

Ctrl + F11 - Inset 4.0 Macro sheet

Ctrl + F1 - Open File

Alt + F1 - Insert a graph

Alt + F2 - Save As

Alt + F4 - Output

Alt + F8 - Macro dialog

Alt + F11 - Visual Basic Editor

Ctrl + Shift + F3 - Create a name using the names of row and column labels

Ctrl + Shift + F6 - Previous Window

Ctrl + Shift + F12 - Printing

Alt + Shift + F1 - New spreadsheet

Alt + Shift + F2 - Save

Alt + = - AutoSum

Ctrl + `- Toggle value / display of the formula

Ctrl + Shift + A - Insert the argument names in the formula

Alt + down arrow - automatic view list

Alt + '- Format Style Dialog

Ctrl + Shift + ~ - General Format

Monday, July 19, 2021

నగర పరిధి లో హెల్మెట్ లేకుండా ప్రయాణించ వచ్చును

 *బ్రేకింగ్ న్యూస్*


*నగర పరిధి లో హెల్మెట్ లేకుండా ప్రయాణించ వచ్చును ***"

సాగర్ కుమార్ జైన్ పిటిషన్ పరిశీలించిన కోర్టు, 

ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీని కోర్టు తిరస్కరించింది.


 మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్‌కు హెల్మెట్ వాడకం తప్పనిసరి కాదు. మీ రక్షణ మీ 

ఇష్టం.


రాష్ట్ర రహదారి లేదా జిల్లా రహదారి హోదా పొందిన రహదారిపై హెల్మెట్ ధరించడం అయితే తప్పనిసరి.


ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు ' మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని మిమ్మల్ని, అడిగితే.. నేను 

మునిసిపల్ కార్పొరేషన్, పంచాయతీ సమితి, నగర పరిధిలోనే ఉన్నానని మీరు వారికి చెప్పవచ్చును....                  


ఈ విషయం అందరికీ తెలిస్తే సంతోషంగా ఉంటుంది.               


నగరం వెలుపల 15 కిలోమీటర్ల లోపు హెల్మెట్ వాడకున్నా మిమ్మల్ని అడగడానికి లేదు.


ఈ సందేశాన్ని సాధ్యమైనంత వరకు భాగస్వామ్యం చేయండి, 


తద్వారా ప్రజలందరికీ కూడా తెలియచేయండి... !!


  ⚖

దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ న్యాయవాది

రాష్ట్ర అధ్యక్షుడు

ఉమ్మడి న్యాయవాది సమాఖ్య

9452680100

8299683093


*పవర్ ఆఫ్ ఆర్టీఐ.*

Thursday, July 15, 2021

ఏపీలో అగ్రవర్ణ పేద లకు రిజర్వేషన్లు

 🙏 ఏపీలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు


🙏ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యాసంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది..


🙏అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది...


🙏ఈ రిజర్వేషన్లకు సంబంధించి బుధవారం రాత్రి జీఓ (ఎంఎస్ నంబర్ 66/2021) విడుదలైంది...


🙏ఈ నిర్ణయంతో ఏపీలో ఉన్న అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి...


🙏సీట్లలో మూడో వంతు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....


🙏 రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి రిజర్వేషన్లు వర్తిస్తాయి.

Tuesday, July 13, 2021

UGC New Rules:

 UGC New Rules: అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల నియామ‌కానికి పీహెచ్‌డీ త‌ప్ప‌నిస‌రి.. స్పష్టం చేసిన యూజీసీ


2018లో యూనివ‌ర్సిటీల్లో బోధ‌నా సిబ్బంది నియామ‌కాల‌పై యూజీసీ కొత్త నిబంధ‌న‌ల‌ను ప్ర‌క‌టించి


ట్రెండింగ్ డెస్క్


ఇక‌పై పీహెచ్ డీ ఉంటేనే యూనివ‌ర్సిటీల్లో టీచింగ్ పోస్టుల‌కు అర్హ‌త ఉంటుంది. యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (ఎంట్రీలెవెల్‌) పోస్ట‌లుకు పీహెచ్‌డీ త‌ప్ప‌నిస‌ర‌ని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) స్ప‌ష్టం చేసింది. ఇప్పటి నుంచి నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్‌) అర్హ‌త‌తో యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేర‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కు యూనివ‌ర్సిటీల్లో, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెస‌ర్లను నేరుగా నియ‌మించ‌డానికి మాస్ట‌ర్ డిగ్రీతోపాటు నెట్‌లో అర్హ‌త‌, పీహెచ్‌డీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ అర్హ‌తలు ఉన్న‌వారు అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉండేది. ఇందులో నెట్ పాసైన‌వారికి ఐదు నుంచి ప‌ది మార్కులు వెయిటేజ్ ఇస్తుండ‌గా పీహెచ్‌డీ చేసిన‌వారికి 30 మార్కులు వెయిటేజీ ఇచ్చేవారు.


2018లో యూనివ‌ర్సిటీల్లో బోధ‌నా సిబ్బంది నియామ‌కాల‌పై యూజీసీ కొత్త నిబంధ‌న‌ల‌ను ప్ర‌క‌టించింది. ‘ఇక‌పై వ‌ర్సిటీల్లో బోధ‌నా సిబ్బంది నియామ‌కానికి పీహెచ్‌డీ చేసిన‌వారు మాత్ర‌మే అర్హులు. ఈ నిబంధ‌న అమ‌లుకు మూడేళ్ళ స‌మ‌యం ఇస్తున్నాం. 2021 నుంచి ఈ నిబంధ‌న‌ను క‌చ్చితంగా అమ‌లుచేస్తాం’ అని అప్ప‌టి కేంద్ర‌మంత్రి జ‌వ‌దేక‌ర్ ప్ర‌క‌టించారు.


ఇక కాలేజీల బోధ‌న సిబ్బంది భ‌ర్తీకి మాస్ట‌ర్స్ డిగ్రీతోపాటు నెట్ లేదా పీహీచ్‌డీ ఉంటే చాలు. అంటే యూనివ‌ర్సిటీల్లో పోస్ట‌ల భ‌ర్తీకి, కాలేజీల్లో లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి యూజీసీ వేరువేరు అర్హ‌త‌ల‌ను నిర్దేశించింది. కేవ‌లం పాఠాలు చెప్ప‌డానికే ప‌రిమితం కాకుండా ప‌రిశోధ‌నారంగంలోనూ ఆస‌క్తి చూప‌డానికి వీలుగా కాలేజీ లెక్చ‌రర్ల‌కు ఈ నిబంధ‌న విధించారు. అలాగే వ‌ర్సిటీల్లో బోధ‌నా ప్ర‌మాణాలు పెంచేందుకు కూడా యూజీసీ ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో అక‌డ‌మిక్ ప‌ర్ఫార్మెన్స్ బేస్డ్ అప్రైజల్ ప‌ద్ధ‌తి స్థానంలో గ్రేడింగ్ విధానానికి మొగ్గు చూపింది. ఇందులో రీసెర్చ్ స్కోర్‌ను ఒక ప్ర‌ధాన అంశంగా ప్ర‌క‌టించింది.


గ‌తంలోని అప్రైజల్ విధానం కాలేజీ లెక్చరర్ల ప‌రిశోధ‌న‌ల‌ను ప్రోత్స‌హించేదిగా ఉండేది. మారిన నిబంధ‌న‌ల‌తో క‌ళాశాల అధ్యాప‌కులు బోధ‌న‌పై మ‌రింత దృష్టిసారించాల్సి ఉంటుంది. అదే స‌మ‌యంలో వ‌ర్సిటీల్లో ప్రొఫెస‌ర్లు అటు టీచింగ్ తోపాటు ఇటు రీసెర్చ్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన కొత్త ప‌ద్ధ‌తులను యూజీసీ అమ‌ల్లోకి తెస్తోంది. అయితే కాలేజీ అధ్యాప‌కుల‌కు ప‌దోన్న‌తులు క‌ల్పించేట‌ప్పుడు బోధ‌నా నైపుణ్యాన్ని ప్ర‌ధానంగా పరిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

*🌼Unity22: అంతరిక్షయాత్ర విజయవంతం

 *🌼Unity22: అంతరిక్షయాత్ర విజయవంతం*


*✳️హ్యూస్టన్‌: వినువీధిలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్షయాత్ర విజయవంతమైంది. ఆరుగురు సభ్యుల బ్రాన్సన్‌ బృందం రోదసీ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని  దాదాపు 90 నిమిషాలకు తిరిగివచ్చారు. రోదసిలోకి మన తెలుగు అమ్మాయి తొలిసారి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష ఈ ఘనత సాధించారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్‌ గెలాక్టిక్‌ ఆదివారం మానవ సహిత వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22ను వీఎంఎస్‌ ఈవ్‌ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడి నుంచి రాకెట్‌ ప్రజ్వలనంతో యూనిటీ-22 మరింత ఎత్తుకు వెళ్లింది. చివరి దశలో  సొంత ప్రయాణాన్ని ప్రారంభించింది.*


 *ఈ వ్యోమనౌకలో వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌తో పాటు మరో అయిదుగురు ప్రయాణించగా.. వారిలో 34 ఏళ్ల శిరీష కూడా ఉన్నారు. నాలుగో వ్యోమగామిగా ఉన్న శిరీష వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి ఫ్లోరిడా విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రయోగాన్ని నిర్వహించారు.  ఈ యాత్ర విజయవంతం కావడంతో భారత్‌ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర పుటలకు ఎక్కారు. ఇంతకుముందు రాకేశ్‌ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్‌ సునీతా విలియమ్స్‌ రోదసిలోకి వెళ్లి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష తల్లిదండ్రులతోపాటు అమెరికాలోని హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వర్జిన్‌ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.*


💦🎊💦🎊💦🎊

జీవో నెంబర్ 2 సస్పెండ్

 *(ఏబీఎన్ స్క్రోలింగ్) అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు - జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు - పంచాయతీ సర్పుంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్‍వోలకు అప్పగిస్తూ జారీచేసిన జీవో నెం.2 సస్పెన్షన్*

సుమన్‌కు దాదా సాహేబ్‌ ఫాల్కే పురస్కారం*

 *🌼సుమన్‌కు దాదా సాహేబ్‌ ఫాల్కే పురస్కారం*


*❇️నటుడు సుమన్‌ను(Actor suman) దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారంతో( Dada Saheb Phalke Award) సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ముంబయిలో ఆదివారం జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో దక్షిణాది నుంచి సుమన్‌ ఈ అవార్డును అందుకున్నారు.*